కాలేజ్ అబ్బాయిని నగ్నంగా చేసి ప్రైవేట్ పార్ట్స్ ?, సోషల్ మీడియాలో వీడియో వైరల్, రాత్రి పూట?
దారుణ హత్య: కర్ణాటకలోని కోలార్‌లో (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లో జరిగిన వరుస హత్యలతో స్థానిక ప్రజలు షాక్ గురై ఆషాక్ నుంచి తేరుకోకముందే రాత్రి మరో హత్య జరిగింది. కోలారు పట్టణంలో ఇంటర్ చదువుతున్న యువకుడిని దారుణంగా నరికి చంపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని కోలారు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
కోలారు పట్టణంలోని పేటేచమనహళ్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కార్తీక్ సింగ్ అలియాస్ కార్తీక్ (17) అనే యువకుడిని ఆరుగురు యువకులు దారుణంగా హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కార్తీక్ హత్య కేసులో నలుగురిని అరెస్టు చేశామని, అజ్ఞాతంలోకి వెళ్లిన మరో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

హత్యకు గురైన కార్తీక్ శరీరంపై మారణాయుధాలతో దాడి చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు, దర్యాప్తు బృందం పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన కోలారు పట్టణ పోలీసులు తెలిపారు. కార్తీక్ సింగ్ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
మా కుమారుడికి జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని, నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడు కార్తీక్ సింగ్ తాత రామ్ సింగ్, పెద్దమ్మ కమలాబాయి పోలీసులకు మనవి చేశారు.
కార్తీక్ సింగ్‌ను దారుణంగా హత్య చేసిన సమయంలో నిందితులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. కార్తీక్ ను బట్టలు విప్పి అతని ప్రైవేట్ పార్ట్స్ మీద దారుణంగా కొట్టి వేధించినట్లు వీడియోలో ఉందని తెలిసింది.
ఇటీవల కార్తీక్ సింగ్ అతని ఫ్రెండ్ పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్లలేదని స్నేహితుల మద్య గొడవ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దిలీప్ అలియాస్ షైన్, అతని గ్యాంగ్ ఇదే విషయంలో ఇటీవల కార్తీక్ తె గొడవపడ్డారని, వాళ్లు రాత్రి ఇంట్లో ఉన్న కార్తీక్‌ను పిలుచుకుని వెళ్లి బట్టలు విప్పి చిత్రహింసలు పెట్టి హత్య చేశారని, గతంలో కూడా ఓ హత్య కేసులో నిందితుడైన దిలీప్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దిలీప్ కానీస్టేబులు్ మురుగన్ కుమారుడు అని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications