Friends: కొత్త పెళ్లి కొడుకు, మందుపార్టీకి పిలిచి పొడిచి చంపేసిన ఫ్రెండ్, ఎస్కేప్, పెళ్లి కూతురు !

చెన్నై/కన్యాకుమారి: కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. తన భార్యతో చక్కగా కాపురం చెయ్యాలని అనుకున్న భర్త హ్యాపీగా ఉంటున్నాడు. చేపలు పడుతూ జీవనం సాగిస్తున్న భర్త అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. కొన్ని రోజులుగా చేపలు పట్టడానికి వెళ్లకుండా ఆ యువకుడు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రెండ్ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో స్నేహితులు అందరూ అతని ఇంటికి వెళ్లి మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో స్నేహితుల మద్య ఓ విషయంలో గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన యువకుడు పార్టీకి వచ్చిన కొత్త పెళ్లి కొడుకును దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది.

 కొత్త పెళ్లి కొడుకు

కొత్త పెళ్లి కొడుకు

తమిళనాడులోని కన్యాకుమారి నగరం సమీపంలోని సకాయమాత వీధిలో గవాస్కర్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన స్టేల్లా మేరీ అనే యువతిని మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్న గవాస్కర్ అతని భార్యతో సంతోషంా కాపురం చేస్తున్నాడు.

 చేపలు పడుతున్న భర్త

చేపలు పడుతున్న భర్త

తన భార్య స్టేల్లా మేరీతో చక్కగా కాపురం చెయ్యాలని అనుకున్న గవాస్కర్ హ్యాపీగా ఉంటున్నాడు. చేపలు పడుతూ జీవనం సాగిస్తున్న గవాస్కర్ అప్పుడప్పుడు కన్యాకుమారిలో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. కొన్ని రోజులుగా చేపలు పట్టడానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్న గవాస్కర్ అతని స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

 పార్టీకి పిలిచిన స్నేహితుడు

పార్టీకి పిలిచిన స్నేహితుడు

కన్యాకుమారిలో గవాస్కర్ కు రాజు అనే స్నేహితుడు ఉన్నారు. గత 17 ఏళ్ల నుంచి గవాస్కర్, రాజు స్నేహితులు. రాజు భార్య, అతని కుటుంబ సభ్యులు శుక్రవారం ఊరికి వెళ్లారు. తన ఇంట్లో ఎవ్వరూ లేరని, తన ఇంట్లో మందు పార్టీ ఏర్పాటు చేశానని, నువ్వు కచ్చితంగా రావాలని రాజు అతని స్నేహితుడు గవాస్కర్ తో పాటు అతని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు.

కొత్త పెళ్లి కొడుకును కత్తితో పొడిచి చంపేసిన ఫ్రెండ్

కొత్త పెళ్లి కొడుకును కత్తితో పొడిచి చంపేసిన ఫ్రెండ్

ఫ్రెండ్ రాజు ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో గవాస్కర్, అతని స్నేహితులు అందరూ అతని ఇంటికి వెళ్లి మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో స్నేహితుల మద్య ఓ విషయంలో గొడవ జరిగింది. ఆ సందర్బంలో రాజు, గవాస్కర్ ల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన రాజు ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని మందు పార్టీకి వచ్చిన కొత్త పెళ్లి కొడుకు గవాస్కార్ ను దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది. గవాస్కర్ ను హత్య చేసిన రాజు తప్పించుకుని పారిపోయాడు.పెళ్లి జరిగి మూడు నెలలు కూడా పూర్తి కాకుండా గవాస్కర్ హత్యకు గురి కావడం కన్యాకుమారిలో కలకలం రేపింది. గతంలో గవాస్కర్ కు, రాజుకు చిన్నచిన్న గొడవలు జరిగాయని, తరువాత ఆ గొడవలు సర్దుమనిగిపోయాయని వాళ్ల స్నేహితులు అంటున్నారు. గవాస్కర్ కు వివాహం అయిన తరువాత ఓ విషయంలో ఇద్దరి మద్య మళ్లీ మనస్పర్థలు వచ్చాయని, అదే విషయంలో మద్యం మత్తులో గొడవ జరిగి గవాస్కర్హత్యకు దారి తీసిందని ఆ సమయంలో వాళ్ల పక్కన ఉన్న ఇద్దరు స్నేహితులు అంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+