పెళ్లిపందిరి: వరుడికి స్నేహితుడు ఇచ్చిన వరైటీ గిఫ్ట్, వధూవరులకు ఉపయోగం, వైరల్!

చెన్నై: దేశంలో ప్రతి రోజూ పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలతో ప్రతిపక్షాలతో పాటు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్లి పందిరిలో వరుడికి అతని స్నేహితుడు వరైటీగా ఐదు లీటర్ల పెట్రోల్ బహుమతిగా ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తమిళనాడులోని కడలూరులో ఎలన్ చెజియన్, కనిమొళిల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన విద్యార్థి ప్రభు హాజరైనాడు. వధూవరులకు వారి బంధువులు, స్నేహితులు రకరకాల బహుమతులు అందించారు.

Frinds gift petrol to groom as wedding gift in Tamil Nadu

అయితే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన విద్యార్థి ప్రభు వరైటీగా ఐదు లీటర్లు పెట్రోల్ క్యాన్ వరుడు ఎలన్ చెజియన్ చేతిలో పెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పెట్రోల్ క్యాన్ బహుమతిగా అందుకున్న వధూవరులు ఎలన్ చెజియన్, కనిమొళి సంతోషం వ్యక్తం చేశారు.

Frinds gift petrol to groom as wedding gift in Tamil Nadu

దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని, నూతన వధూవరులు బైక్ లో సంచరించడానికి ఈ పెట్రోల్ ఉపయోగపడుతోందని విద్యార్థి ప్రభు అన్నారు. పెళ్లి సందర్బంలో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఎలన్ చెజియన్ కు ఇచ్చిన కొత్త బైక్ లో ఐదు లీటర్ల పెట్రోల్ పోశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+