1206.. విజయ్ రూపాణీ లక్కీ నంబర్.. కారు, బైక్, టికెట్, సీటు నంబర్ ఇదే.. కానీ అదే రోజు ..
ఒక్కోసారి ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు మైండ్ బ్లాంక్ అవుతూ ఉంటుంది. భావోద్వేగానికి లోనవుతూ ఉంటాం. జూన్ 12న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు.
అయితే ఈ ప్రమాదంలో గుజరాజ్ మాజీ సీఎం విజయ్ రూపాణీ కూడా మృతి చెందారు. లండన్ లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు ఆయన జూన్ 12 ఎయిరిండియా విమానం ఎక్కారు. ఈ ఫ్లైట్ కుప్పకూలడంతో ప్రయాణికులతోపాటు ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. విజయ్ రూపాణీకు మృదు స్వభావిగా మంచి పేరుంది. ఆయన 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు రెండు సార్లు గుజరాత్ సీఎంగా పనిచేశారు. పాలనలో తనదైన ముద్ర వేశారు విజయ్ రూపాణీ. ఆయన మృతితో రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
"किस्मत भी नंबर देखकर सेटिंग करती है भाई...
— News100Plus (@News100_Plus) June 13, 2025
विजय रूपाणी जी का फेवरेट नंबर 1206 था,
और किस्मत ने बोला — 'ठीक है, चलो इसी दिन विदाई करते हैं!' 😔
#1206 #FateGameStrong #VijayRupani"#VijayRupani#1206Mystery#FateOrCoincidence#RIPVijayRupani#KismatKaKhel#FormerCM… pic.twitter.com/CZzllHc2Q0
విజయ్ రూపాణీ మృతితో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన లక్కీ నంబర్ 1206
అట. విజయ్ రూపాణీ కారు నంబర్, బైక్ నంబర్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు 12 జూన్ అంటే 12-06 తేదీనే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. లక్కీ నంబర్ తేదీ రోజే విజయ్ రూపాణీ మృతి చెందడం బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

విజయ్ రూపాణీ కారు, బైక్ నంబర్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక విజయ్ రూపాణీ కార్యకర్త స్థాయి నుంచి సీఎంగా ఎదిగారు. కార్పొరేటర్ గా, మేయర్ గా, రాజ్యసభ ఎంపీగా గుజరాత్ కు ఆయన సేవలు అసామాన్యం అని పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. విజయ్ రూపాణీ 1956 ఆగస్టు 2 న మయన్మార్ లోని యాంగూన్ లో జన్మించారు. అయితే చిన్నప్పుడే ఆయన కుటుంబం రాజ్ కోట్ కు తరలివచ్చింది.












Click it and Unblock the Notifications