వరుసగా ఆరో రోజు తగ్గిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధర కూడా తగ్గింపు
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. పెట్రోల్ ధరపై రూ.14 పైసలు, డీజిల్ పైన రూ.15 పైసలు తగ్గింది. పెట్రోల్ ధరలు వరుసగా ఆరో రోజు తగ్గగా, డీజిల్ ధరలు ఐదు రోజులు తగ్గాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డాటా ప్రకారం... ఆరు రోజుల పాటు తగ్గిన పెట్రోల్ ధర ఢిల్లీ, ముంబైలలో 47 పైసలు, కోల్‌కతాలో 46 పైసలు, చెన్నైలో 49 పైసలు. డీజిల్ ధర విషయానికి వస్తే ఢిల్లీ, కోల్‌కతాలలో 34 పైసలు, ముంబై, చెన్నైలలో 36 పైసలు తగ్గింది.

ధరల విషయానికి వస్తే... సోమవారం పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 77.96, కోల్‌కతాలో రూ. 80.60, ముంబైలో రూ. 85.77, చెన్నైలో రూ. 80.94గా ఉంది. హైదరాబాద్‌లో రూ. 82.59గా ఉంది. డీజెల్ ధర ఢిల్లీలో రూ. 68.97, కోల్‌కతాలో రూ. 71.52, ముంబైలో రూ. 73.43, చెన్నైలో రూ. 72.82గా ఉండగా, హైదరాబాద్‌లో రూ. 74.97గా ఉంది.












Click it and Unblock the Notifications