12వ రోజూ తగ్గిన పెట్రో ధరలు: మొత్తంగా రూ.3 తగ్గింది

న్యూఢిల్లీ: వరుసగా తగ్గుతున్న పెట్రో ధరలు వాహనదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే.

వరుసగా 12వ రోజు వీటి ధరలు మరికాస్త తగ్గాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80 దిగువకు వచ్చింది. ఢిల్లీలో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు తగ్గి రూ. 79.75గా ఉంది. ఇక డీజిల్‌ కూడా 20 పైసలు తగ్గి రూ. 73.85గా ఉంది.

Fuel prices fall further: Petrol below Rs 80 in Delhi, diesel down by 20 paise/litre

సోమవారం కూడా పెట్రో ధరలు తగ్గుముఖం పట్టడంతో ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.24గా ఉంది. కోల్‌కతాలో రూ. 81.63, చెన్నైలో రూ. 82.86, హైదరాబాద్‌లో రూ. 84.54కు చేరింది. ఇక డీజిల్‌ ధర ముంబైలో రూ. 77.40, కోల్‌కతాలో రూ. 75.70, చెన్నైలో రూ. 78.08, హైదరాబాద్‌లో రూ. 80.35గా ఉంది.

కాగా, అక్టోబరు 18 నుంచి ఈ తగ్గింపు కొనసాగుతోంది. ఈ 12 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 3.08 తగ్గగా.. 11 రోజుల్లో(అక్టోబరు 24న డీజిల్‌ ధర స్థిరంగా ఉంది) డీజిల్‌పై రూ. 1.84 తగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+