మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: మొత్తంగా ఎంత తగ్గిందంటే?
న్యూఢిల్లీ: పెట్రో ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతున్న విషయం తెలిసిందే. శనివారం కూడా స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై 19పైసలు తగ్గడంతో రూ.78.99కి చేరింది. లీటర్ డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ.73.53కు చేరింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధరపై 19పైసలు తగ్గి రూ.84.49కి చేరింది. డీజిల్ ధర 12పైసలు తగ్గి రూ.77.06గా ఉంది. చెన్నై, కోల్‌కతా నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.82.06గా, రూ.80.89గా ఉండగా, డీజిల్ ధరలు రూ.77.73గా, రూ.75.39గా ఉన్నాయి.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.83.75గా ఉంది. డీజిల్ రూ.80కి చేరుకుంది.
కాగా, గత 15రోజుల్లో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.3.28గా తగ్గగా, డీజిల్‌పై రూ.1.84 తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.












Click it and Unblock the Notifications