G20 Summit 2023: వివిధ దేశాధి నేతలతో ప్రధాని మోడీ, తొలి స్పీచ్, జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్

ఢిల్లీ: జీ-20 (G20 Summit)శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ నగరం అత్యంత సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే పలు దేశాధినేతలు, ఆయా దేశాల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు.ఈ శిఖరాగ్ర సమావేశానికి 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఆహ్వానిత అతిథి దేశాల నుండి ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యారు.

G20 Summit 2023 Delhi LIVE Updates in telugu:Chief guest key highlights traffic restrictions and more

ఈరోజు,సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలోని భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్‌లో G20 శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. గ్రూప్ ఆఫ్ 20 ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్య దేశంగా గుర్తింపునిస్తూ ఆమోదించింది.ఏడాది పొడవునా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే దిశగా పలు మంత్రివర్గ సమావేశాలు, వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఎజెండాలో వాతావరణ మార్పు, రుణం, ఆహార భద్రత, సుస్థిరత మరియు భౌగోళిక రాజకీయ సంఘర్షణపై చర్చలు జరిగాయి. జీ20 అధ్యక్ష పీఠాన్ని నిర్వహిస్తున్న భారత్ ఈ ఏడాది శిఖరాగ్ర సదస్సు థీమ్‌గా 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'ను హైలైట్ చేసింది. సఖ్యత కొరవడిన ఉమ్మడి నేతల ప్రకటనపైనే అందరి దృష్టి నెలకొంది.ఇక జీ 20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి మినిట్‌ - టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Sep 10, 2023, 3:57 pm IST

"భారతదేశం G20 ప్రెసిడెన్సీ ప్రపంచానికి మార్గాన్ని నిర్దేశించింది": ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా
Sep 10, 2023, 3:56 pm IST

"ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చాలా ఉత్పాదక మధ్యాహ్న భోజన సమావేశం జరిగింది. మేము అనేక అంశాలపై చర్చించాము, భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాలు పురోగతి కొత్త శిఖరాలను స్కేల్ చేయడానికి ఎదురుచూస్తున్నాము’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Sep 10, 2023, 3:49 pm IST

"G20 సమ్మిట్ ఒక మైలురాయి.. డిక్లరేషన్‌లో ఆరోగ్యకరమైన పరిష్కారం కనుగొనబడింది": రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్
Sep 10, 2023, 2:27 pm IST

ఉక్రెయిన్ తన స్వహస్తాలతో తన నాశానాన్ని కొనితెచ్చుకుందని జీ20 సమావేశాల్లో పాల్గొన్న రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ లవ్రోవ్ వ్యాఖ్యానించారు. అమెరికా, ఐరోపా దేశాల తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు.
Sep 10, 2023, 2:17 pm IST

భారత్ నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలను అందుకున్న బ్రెజిల్.
Sep 10, 2023, 2:12 pm IST

ఢిల్లీ నుంచి వియత్నాం బయల్దేరి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
Sep 10, 2023, 1:14 pm IST

ఉక్రెయిన్ వివాదంలో శాంతి కోసం అధ్యక్షుడు బిడెన్ చేస్తున్న ప్రయత్నాల్లో న్యూఢిల్లీ జి20 ప్రకటన పెద్ద ముందడుగు: అమెరికా సీనియర్ అధికారి
Sep 10, 2023, 12:59 pm IST

బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు ప్రధాని నరేంద్ర మోదీ G 20 అధ్యక్ష పదవిని అందజేశారు.
Sep 10, 2023, 12:14 pm IST

చర్చలకు అనుగుణంగా జీ20 ఢిల్లీ ప్రకటన, ఉక్రెయిన్‌లో శాంతికి "మెట్టు": ఈయూ
Sep 10, 2023, 12:01 pm IST

G20 ఇప్పటికీ సమస్యలకు పరిష్కారాలను చూపించి నడిపించగలదని ఈ సంవత్సరం సమ్మిట్ నిరూపించింది...": అమెరికా అధ్యక్షుడు బిడెన్
Sep 10, 2023, 11:54 am IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు, ఇతర నేతలు రాష్ట్రపతి ఏర్పాటు చేసిన గాలా డిన్నర్‌లో ఉన్నారు.
Sep 10, 2023, 11:48 am IST

ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో G20 సమ్మిట్ సెషన్ 3కి ముందు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక మొక్కను అందజేశారు.
Sep 10, 2023, 11:21 am IST

ఆఫ్రికన్ యూనియన్‌ను G20లో చేర్చడం మరింత సమగ్ర ప్రపంచ సంభాషణ దిశగా గణనీయమైన పురోగతి: ప్రధాని మోదీ.
Sep 10, 2023, 11:20 am IST

జీ20 సమావేశాల ముగింపు అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ నుంచి వియత్నాం బయల్దేరారు.
Sep 10, 2023, 11:19 am IST

మెరుగైన గ్రహం కోసం జీ20 సదస్సులో ఉత్పాదక చర్చలు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
Sep 10, 2023, 11:18 am IST

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో యూకే ప్రధాని రుషి సునక్ దంపతులు.
Sep 10, 2023, 11:17 am IST

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళుర్పించిన జీ20 దేశాధినేతలు.
Sep 10, 2023, 11:16 am IST

అక్షర ధామ్ ఆలయంలో యూకే ప్రధాని రుషి సునక్ దంపతులు.
Sep 10, 2023, 11:15 am IST

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో యూకే ప్రధాని రుసి సునక్, ఆయన సతీమణి అక్షతా మూర్తి.
Sep 10, 2023, 11:13 am IST

ప్రధాని మోడీ, యూకే ప్రధాని రుషి సునక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.
Sep 10, 2023, 11:12 am IST

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ మరియు ఆయన భార్య అక్షతా మూర్తి.
Sep 10, 2023, 10:39 am IST

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్, ఆయన సతీమణి అక్షతా మూర్తి.
Sep 10, 2023, 10:37 am IST

రాష్ట్రపతి విందుు హాజరైన తమిళనాడు సీఎం స్టాలిన్ తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరచాలనం.
Sep 10, 2023, 10:35 am IST

ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్.
Sep 10, 2023, 10:34 am IST

దేశ, ప్రభుత్వాధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి, మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
Sep 10, 2023, 10:32 am IST

రాజ్ ఘట్ వద్ద జీ20 దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు.
Sep 10, 2023, 10:29 am IST

ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, యూకే పీఎం రిషి సునక్, ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రీమియర్ లీ కియాంగ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, ఇతర దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు.. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించి, పుష్పగుచ్ఛం ఉంచారు.
Sep 10, 2023, 10:04 am IST

మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు.
Sep 10, 2023, 10:03 am IST

మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు.
Sep 10, 2023, 10:02 am IST

G 20 నాయకులు, ఇతర అంతర్జాతీయ సంస్థల అధినేతలు మహాత్మా గాంధీకి నివాళులర్పించి, పుష్పగుచ్ఛం ఉంచారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్‌ను పూలతో అలంకరించారు.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+