జిన్‌పింగ్ డుమ్మా కొట్టిన వేళ.. ఢిల్లీకి చేరుకున్న చైనా నుంచి కీలక నేత

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు.

జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

ఈ సమావేశంలో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్.. కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో దిగింది. ఈ నెల 10వ తేదీ వరకూ ఆయన భారత్‌లోనే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలతో పాటు జీ20 సమ్మిట్‌లో పాల్గొంటారు.

జీ20లో సభ్య దేశంగా కొనసాగుతున్న చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్.. ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన హాజరు కావట్లేదు. చైనా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి లి కియాంగ్ హాజరవుతారు. ఆయన ఎందుకు జీ20 సదస్సుకు హాజరు కాలేకపోతున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.

Xi Jinping

జీ20 సదస్సులో పాల్గొనడానికి లి కియాంగ్.. భారత్‌కు వచ్చారు. ఢిల్లీ పాలం ఎయిర్‌బేస్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. కేంద్రమంత్రి రిటైర్డ్ ఆర్మీ జనరల్ వీకే సింగ్, ఇతర అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ఉన్నతాధికారులు ఆయనకు ఆహ్వానం పలికారు.

ఇటీవలే దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్ వేదికగా ముగిసిన బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తరువాత చైనా ఓ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేయడం, అరుణాచల్ ప్రదేశ్, లఢక్ సమీపంలోని అక్సాయ్ చిన్‌ను తమవిగా చూపించడం వివాదాస్పదమైంది.

ఇదే అంశాన్ని జీ20 సదస్సుల్లో ప్రస్తావించాలని భారత్ నిర్ణయించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో జిన్‌పింగ్ డుమ్మా కొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనకు బదులుగా లీ కియాంగ్ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. శనివారం ఉదయం ప్రగతి మైదాన్‌‌లోని భారత్ మండపంలో ఏర్పాటయ్యే సమావేశంలో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+