G20 Summit: అతిధ్యం అదుర్స్, వాద్య దర్శన్ - మమతా, నితీశ్ హాజరు..!!
ప్రపంచాధినేతలంతా ఒక్క చోటే చేరుతున్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం సకల ఏర్పాట్లతో స్వాగతం పలుకుతోంది. మినీ ఐక్యరాజ్య సమితి తరహాలో అగ్రరాజ్యాధినేతలు సహా 40కి పైగా దేశాల అధినేతలు, వివిధ ప్రపంచస్థాయి సంస్థల అధిపతులకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అతిధుల కోసం రాష్ట్రపతి ముర్ము విందు ఏర్పాటు చేసారు. ఇందులో విదేశీ డెలిగేట్స్ తో పాటుగా ముఖ్యమంత్రులు...పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారు.
తరలి వస్తున్న అతిధులు : జీ20 సదస్సుకు సర్వం సిద్దమైంది. విదేశీ అతిధులు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. వారికి స్వాగతం నుంచి ఆత్మీయ ఆతిధ్యం వరకూ కేంద్రం అన్నింగా దేశ సంప్రదాయం ప్రతిబింభించేలా చర్యలు తీసుకుంది. విదేశీ అతిధులకు అదిరిపోయే ఆతిధ్యం అందిస్తోంది. జీ20 సదస్సు వేళ డెలిగేట్స్ కు రాష్ట్రపతి ముర్ము శనివారం విందు ఏర్పాటు చేసారు.

ఈ విందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించారు. జి20 దేశాధినేతల గౌరవార్థం శనివారం రాత్రి మోదీ ఇచ్చే విందుకు 500 మంది పారిశ్రామికవేత్తలకు భారత్ ఆహ్వానాలు పంపింది. వీరిలో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇం డస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా పలువురు పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రుల హాజరు : ఇదే సమయంలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విందు సమయంలోనే జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చే దేశాధినేతల సతీమణులు, వారి కుటుంబ సభ్యులకు మరపురాని అనుభూతిని కల్గించేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇండియాగేట్ హెక్సాగాన్‌లో ఉన్న నేషనల్ గ్యాలరీ ఫర్ మోడర్న్ ఆర్ట్ (జైపూర్ హౌజ్)లో దేశాధినేతల కుటుంబ సభ్యుల కోసం విందు ఏర్పాటు చేశారు. అదిరిపోయే దేశీయ వంటకాల రుచులతో పాటు తృణధాన్యాలు, చిరు ధాన్యాలతో రుచికరంగా చేసిన వంటకాలను వారికి అందించనున్నారు. కేవలం విందుతో సరిపెట్టకుండా వారిని మంత్రముగ్ధులను చేసేలా ప్రత్యేకంగా వారికోసమే ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భారతీయ హస్తకళలు, చేనేత వస్త్రాలు, కళారూపాలు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే అలంకరణ వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

వాద్య దర్శన్ ఏర్పాటు : ప్రపంచ దేశాల అతిథులకు భారతీయ శాస్త్రీయ సంగీతంలో మాధుర్యాన్ని తెలియజేసే ఏర్పాటు కూడా భారత ప్రభుత్వం చేసింది. ఓ గంటన్నర పాటు సాగే వాద్య దర్శన్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ సంగీత రూపకాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం అనేక వాద్య పరికరాలను ఉపయోగించనున్నారు. వాటిలో అతి అరుదుగా కనిపించే సుర్‌బహార్, జల్‌తరంగ్, నల్‌తరంగ్, విచిత్ర వీణ, రుద్ర వీణ, సరస్వతి వీణ, ధాంగ్లీ, సుంద్రీ, భాపాంగ్, దిల్‌రుబా వంటి సంగీత పరికరాలు కూడా ఉన్నాయి
. మొత్తంగా 34 హిందుస్తానీ వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత పరికరాలు, దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 26 జానపద సంగీత పరికరాలతో పాటు 11 మంది చిన్నారులతో కలిపి మొత్తం 78 మంది కళాకారులు (దివ్యాంగులతో సహా) ఈ ప్రదర్శనలో భాగం కానున్నారు. వారంతా తమ తమ రాష్ట్రాల సంప్రదాయ దుస్తుల్లో ఈ సంగీత విభావరి నిర్వహించనున్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications