Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోన్ ఎగ్గొట్టిన సూపర్ స్టార్‌- బంగళాను వేలానికి ఉంచిన బ్యాంక్

ముంబై: బాలీవుడ్‌ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ.. గదర్ 2. 2001లో వచ్చిన గదర్- ఏక్ ప్రేమ్ కథకు సీక్వెల్. అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వా, గౌరవ్ చోప్రా.. కీలక పాత్రలను పోషించారు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఇది లేటెస్ట్ బ్లాక్ బస్టర్. 430 కోట్ల రూపాయలను అవలీలగా ఆర్జించిందీ మూవీ.

ఈ నెల 11వ తేదీన రిలీజ్ అయిన ఆ సినిమా కలెక్షన్లు ఏమాత్రం తగ్గట్లేదు. 80 కోట్ల రూపాయలతో తెరకెక్కిన గదర్ 2.. క్లోజింగ్ బిజినెస్ సాధించే సమాయానికి 500 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ నిర్మించింది.

Gadar 2: Sunny Deols Juhu residence has been put up for auction by the Bank of Baroda

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు సన్నీ డియోల్. ఇదే ఊపుతో మరిన్ని యాక్షన్ సినిమాలకు సైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం జుహూలోని గాంధీ గ్రామ్ రోడ్‌లో గల సన్నీ డియోల్ బంగళాను వేలానికి ఉంచింది.

ఈ మేరకు ఓ అడ్వర్టయిజ్‌మెంట్ ఇచ్చిందా బ్యాంక్. గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 51.5 కోట్ల రూపాయలను సన్నీ డియోల్ లోన్‌గా తీసుకున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పటివరకు చెల్లించలేదు. దీనితో లోన్ రికవరీ కింద ఈ బంగళాను వేలానికి ఉంచింది. సెప్టెంబర్ 25వ తేదీన వేలం వేయనున్నట్లు తెలిపింది.

Gadar 2: Sunny Deols Juhu residence has been put up for auction by the Bank of Baroda

ఈ బిల్డింగ్ రిజర్వ్ ధర 51.43 కోట్ల రూపాయలు. ఈ బిల్డింగ్‌ను వేలం ద్వారా అమ్మడం వల్ల సన్నీ డియోల్ చెల్లించాల్సిన మొత్తం, దానికి అయిన వడ్డీని కలిపి 55 కోట్ల రూపాయలను వసూలు చేయనున్నట్లు తెలిపింది. అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్‌ను రుణగ్రహీత/గ్యారంటీర్‌గా గుర్తించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+