నోట్ల రద్దుతో వచ్చిన లాభం అందరికీ షేర్ చేస్తాం: కేంద్రమంత్రి గోయల్
నోట్ల రద్దు వల్ల వచ్చిన లాభాన్ని అందరికి పంచుతామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శనివారం నాడు చెప్పారు.
బెంగళూరు: నోట్ల రద్దు వల్ల వచ్చిన లాభాన్ని అందరికి పంచుతామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శనివారం నాడు చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బెంగళూరు (ఐఐఎంబీ) ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాల పైన విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. నోట్ల రద్దు వల్ల వచ్చిన లాభాన్ని అందరికీ పంచుతామని చెప్పారు.
ఐఐఎంబీ లీడర్‌షిప్ సమ్మిట్ 2016లో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. దీని వల్ల కలిగిన లాభాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామన్నారు. ముఖ్యంగా పేదవారికి ఉపయోగపడేలా చేస్తామన్నారు.

నోట్ల రద్దు అనంతరం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు అన్నీ ఏకమై ప్రధాని మోడీ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నాయి. దీనిపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కొద్దిమంది తప్పితే దేశం మొత్తం నోట్ల రద్దును సమర్థిస్తోందని చెప్పారు. ప్రజల నుంచి మద్దతు లభించినందుకు సంతోషంగా ఉందని గోయల్ చెప్పారు.
ఇదిలా ఉండగా, నోట్ల రద్దు వల్ల వెంటనే కలిగిన లాభాలను పీయూష్ గోయల్ చెప్పలేదు. నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే.
అందరికీ విద్యుత్
2022 కల్లా అందరికీ విద్యుత్ లక్ష్యమని గోయల్ చెప్పారు. అప్పటికల్లా అందరికీ 24X7 విద్యుత్ రావడం ఖాయమని, దీనిపై ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉందని చెప్పారు.
విద్యుత్ తమ ప్రభుత్వ లక్ష్యాలలో మరో ముఖ్యమైనది అని చెప్పారు. అవసరమైన విద్యుత్ అందరికీ 2022కల్లా ఇస్తామని చెప్పారు. అప్పటికి భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందన్నారు. ప్రతి ఇంటికి నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యమని, ఏ ఒక్క చిన్నారి చదువు కూడా విద్యుత్ సమస్యతో ఆగిపోకూడదన్నారు.












Click it and Unblock the Notifications