గాలి కూతురు వెడ్డింగ్ కార్డు రూపకర్త ఎవరో తెలుసా?
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూతురు వెడ్డింగ్ కార్డు ఆర్భాటం, హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే, దాని రూపకర్త ఎవరో తెలిస్తే మరింత ఆశ్చర్యపోవడ ఖాయం.
నెట్‌లో గాలి జనార్ధన్‌రెడ్డి కూతురి వెడ్డింగ్ కార్డు హల్‌చల్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ కార్డ్ రూపకర్త డైలాగ్ కింగ్ సాయికుమార్ అని తెలుస్తోంది. సాయికుమార్ నేతృత్వంలో తెలుగు చలన చిత్ర రంగ సాంకేతిక నిపుణులు ఐదు రోజులపాటు శ్రమించి పాట రూపంలో ఉండే ఈ వీడియో ఆహ్వాన పత్రికను రూపొందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆహ్వాన పత్రికలో ప్రత్యేక బాక్స్‌ను సిద్ధం చేశారు. బాక్స్‌ను తెరిచిన తక్షణం వీడియో దానంతట అదే ప్లే అవుతోంది. గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రహ్మణి వివాహం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డితో నవంబరు 16వ తేదీన జరగనుంది.
వారి నిశ్చితార్థం గత నెలలో బెంగళూరులోని గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో జరిగింది. నవంబరు 16వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. బెంగళూరులోని మెయిన్ ప్యాలెస్ మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications