గాలికి ఐటీ శాఖ ప్రశ్నలు ఇవే ! ఇప్పుడు ఏం చేద్దాం ?
గాలి జనార్దన్ రెడ్డి అక్రమ సంపాదనతో ఆయన కుమార్తె వివాహం చేశారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో సోమవారం బెంగళూరు ఐటీ శాఖ విభాగం ఉప సంచాలకుడు సంజీవ్ కుమార్ వ
బెంగళూరు/బళ్లారి: మైనింగ్ సామ్రాట్, కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ అధికారులు పలు ప్రశ్నలు వేశారు. ఈనెల 25వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని ఐటీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 16వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఘనంగా చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి అక్రమ సంపాదనతో ఆయన కుమార్తె వివాహం చేశారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో సోమవారం బెంగళూరు ఐటీ శాఖ విభాగం ఉప సంచాలకుడు సంజీవ్ కుమార్ వర్మ తన సాటి అధికారులతో కలిసి బళ్లారి వెళ్లి సోదాలు చేశారు.
గాలిపై ఐటీ దాడులు అందుకే: ఇదీ లెక్క !
బళ్లారీలోని హవంబావిలోని గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో, అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ), అనంతపురం గనుల సంస్థ (ఎఎంసీ) కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఇంట్లో, కార్యాలయాల్లోని రికార్డులు పరిశీలించారు. కీలక పత్రాలు పరిశీలించి పూర్తి వివరాలు సేకరించారు.

గాలి కుమార్తె పెళ్లి: ఆ నటుడికి చుక్కలు చూపిస్తారా ?
గాలి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ అధికారులు వేసిన ప్రశ్నలు ఇవే !
1. కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ?
2. ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు ఖర్చు చేశారు ?
3. పెళ్లికి మొత్తం ఎంత డబ్బలు ఖర్చు చేశారు ?
4. ఆ సోమ్ము ఎక్కడి నుంచి సమకూర్చారు ?
5. ఆ సోమ్ము సమకూర్చిన వారెవరు ? వారి వివరాలు ఇవ్వండి.
6. వివాహానికి ఎంత మంది వచ్చారు ? వారికి చేసిన ఏర్పాట్లు ఏంటీ ?
7. వినోదం, వీడియో, వీవీఐపీ, వీఐపీల భద్రతకు ఎంత ఖర్చు చేశారు ?
8. పెళ్లికి ఖరీదైన ఆహ్వాన పత్రికలు ఎన్ని ముద్రించారు ? వాటిని ముద్రించిన సంస్థల వివరాలు ఏంటీ ?
9. పెళ్లికి బ్రహ్మాండమైన భోజనాలు సమకూర్చారు, ఆ ఖర్చుల పట్టి ఎంత ?
10. పెళ్లికి ఎంత మంది పురోహితులు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు ? వారికి ఇచ్చిన సంభావనల వివరాలు ఏంటి ?
11. పెళ్లికి వచ్చిన అతిథులకు ఇచ్చిన కానుకలేంటి ?
12. పెళ్లికి నగదు రూపంలో ఎంత ఖర్చు చేశారు ? నగదు రూపంలో నిధులు సేకరించినట్లయితే ఆ నగదు అందించిన సంస్థలు, వ్యక్తుల పేర్లు, వివరాలు ఏంటీ?
13. డెబిట్, క్రిడిట్ కార్డుల్లో ఎంత మొత్తంలో నగదు తీసుకున్నారు ? వాటి వివరాలు ఏంటి ?
తదితర 16 ప్రశ్నలతో గాలి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ అధికారులు ఓ తాఖీదు జారీ చేశారు.ఈ నెల 25వ తేదీ లోపు పూర్తి సమాచారం, వివాహానికి సంబంధించిన బిల్లులు అన్ని తమకు సమర్పించాలని ఐటీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద పెళ్లి ఖర్చుల పూర్తి వివరాలు ఐటీ శాఖ అధికారులకు ఇవ్వడానికి గాలి జనార్దన్ రెడ్డి సిద్దం అయ్యారని తెలిసింది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications