రిజల్ట్ తరువాత సీఎం కుర్చీ హుష్ కాకి, హైకమాండ్ వెయిటింగ్, గాలి జనార్దన్ రెడ్డి సంచలనం
లోక్ సభ ఎన్నిక జోరు ఊపందుకుంది. నేటితో కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్ డీఏ కూటమి, ఇండియా కూటమిలోని పార్టీల అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఇదే సమయంలో మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చే అంశం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పదేపదే చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి దించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎదురు చూస్తున్నారని కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజేపీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోరని, అందుకే ఆయన్ను సీఎం పదవి నుంచి దించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎదురు చూస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు డబ్బులు ఇచ్చే సీఎం కావాలని, కాబట్టి కర్ణాటకలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించాలని రాహుల్ గాంధీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి వ్యంగంగా అన్నారు.
ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని, ఆయనకు డబ్బులు తీసుకునే అలవాటు కూడాలేదని, అంతే కాకుండా ఎవరు అడిగినా డబ్బు ఇవ్వరని, కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు డబ్బులు ఇచ్చే ముఖ్యమంత్రి కావాలని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు డీకే శివకుమార్ లాంటి ముఖ్యమంత్రి కావాలని, డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని రాహుల్ గాంధీ ఎదురుచూస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు కైవసం చేసుకోకుంటే సీఎం సిద్దరామయ్య పదవితో పాటు పలువురు మంత్రుల పదవులు ఊడిపోతాయని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో కూడా రాజకీయాలు రసవత్తరంగా మారిపోతాయని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications