గాలి బ్రహ్మిణి వజ్రాల నగలు ఎన్ని రూ. కోట్లు అంటే ?

బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వేసుకున్న బంగారు, వజ్రాల నగలు విలువ ఎంత అనే విషయంపై ఇప్పుడు చర్చ మొదలైయ్యింది. గాలి బ్రహ్మిణి పెళ్లికి హాజరైన వారిని ఆమె వేసుకున్న నగలు కళ్లు పక్కకు తిప్పుకోలేకుండా చేశాయి.

గాలి జనార్దన్ రెడ్డి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన కుమార్తె వివాహం చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లికి వెళ్లిన వారు గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణిని చూసిన తరువాత ఆశ్చర్యానికి గురైనారు.

గాలి బ్రహ్మిణి వేసుకున్న వజ్రాల నగలు తలుక్కున మెరిసిపోయాయి. ఆమె అచ్చం రాకుమారిలాగా అందరికి దర్శనం ఇచ్చారు. పూర్వకాలంలో దేవకన్యలు, రాకుమారులు ఎలాగుంటారో మనం సినిమాల్లో చూసి ఉంటాం.

 Gali Janardhan Reddy

అయితే ఈ ఫోటోలో గాలి బ్రహ్మిణిని చూస్తే దేవకన్యలు గుర్తుకు వస్తారు. ఆమె వేసుకున్న వజ్రాల నక్లెస్ లు, ఉంగరాలు, ఆభరణాలు కళ్లు చెదిరే విధంగా ఉన్నాయి. గాలి బ్రహ్మిణి వేసుకున్న వజ్రాల నగల ధర దాదాపు రూ. 90 కోట్లు ఉంటుందని మీడియా కోడైకూస్తుంది.

గాలి జనార్దన్ రెడ్డి నల్లధనంతో వెచ్చించి తన కుమార్తె పెళ్లి చేస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాము ఫిర్యాదును పరిశీంచి తగిన చర్యలు తీసుకుంటామని ఐటీ అధికారులు చెప్పారని అధికారులకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త మీడియాకు చెప్పారు.

ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర హోం శాఖా మంత్రి జీ. పరమేశ్వర్ గాలి కుమార్తె పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి దేశం అంతటా హాట్ టాఫిక్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+