హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి కుమార్తె పెళ్లి 11 రోజులు: ఎస్ఆర్ కే, కత్రినా డ్యాన్స్ !

|
Google Oneindia TeluguNews

బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఏకైక కుమార్తె బ్రహ్మణి వివాహాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారిడితో గాలిజనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మణి నిశ్చితార్థం జరిగింది.

గత నెల వైభవంగా నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 16వ తేదిన బెంగళూరు నగరంలోని ప్యాలెస్స్ గ్రౌండ్స్ లో కనీవిని ఎరగని రీతిలో పెళ్లి వేడుకలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మణి పెళ్లి వేడుకలు 11 రోజుల పాటు రంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. పెళ్లి విందులు తయారు చెయ్యడానికి 9 రాష్ట్రాల నుంచి వంట మనుషులను పిలిపించారు.

Gali Janardhan Reddy Daughter wedding in Karnataka

వివాహ వేడుకులకు వచ్చే అతిథులకు ప్రత్యేకంగా సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కత్రినాకైఫ్ తో పాటు ప్రముఖులు, టాలీవుడ్, శాండిల్ వుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరౌతారని గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితులు తెలిపారు.

అక్రమాస్తులు, అక్రమ గనుల కేసులలో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి చాల కాలం జైలు జీవితం గడిపి జామీనుపై బయటకు వచ్చారు. ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కుమార్తె వివాహం అనంతరం రాజకీయాల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు.

English summary
That SRK and Katrina to Dance in the lavish wedding of Gali Janardhan Reddy Daughter in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X