గాలి పెళ్లి కథ సరే: ఆ టెన్నిస్ తార గురించి ఏంది ?

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బ్లాక్ మనీతో తన కుమార్తె పెళ్లి చేస్తున్నాడని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు అనీల్ లాడ్ మీద బీజేపీ నాయకులు ఎదురుదాడి చేశారు. బ్లాక్ మనీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు.

బ్లాక్ మనీతో కుమార్తె పెళ్లి చేస్తున్న గాలి జనార్దన్ రెడ్డి విషయంలో బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు, మైనింగ్ వ్యాపారి అనీల్ లాడ్ (బళ్లారి జిల్లా) ప్రశ్నించారు. బీజేపీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డికి కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు.

Gali Janardhan Reddy family lavish wedding

కేఐఏడీబీ మంజూరు చేసిన భూములు ఏమైనాయి ? బ్రహ్మిణి స్టీల్స్ కోసం ఇచ్చిన భూములు ఏమి చేశారు ? అని గాలి జనార్దన్ రెడ్డిని ఉద్దేశించి అనీల్ లాడ్ అనే ప్రశ్నలు అడిగారు. ఈ విషయంపై బీజేపీ బళ్లారి జిల్లా అధ్యక్షుడు ఎస్. గురులింగనగౌడ ఎదురుదాడి చేశారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ శాసన సభ్యుడు అనీల్ లాడ్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. పుట్టిన రోజు వేడుకలకు సినిమా తారలను పిలుపించుకుని ఎంజాయ్ చేసింది ఎవరు ? ఓ టెన్నిస్ తారతో కలిసి గంట సేపు టెన్నీస్ ఆడి మజా చేసేందుకు ఆమెకు లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరు ? అంటూ పలు ప్రశ్నలు వేశారు.

Gali Janardhan Reddy family lavish wedding

గాలి జనార్దన్ రెడ్డి సాంప్రధాయ ప్రకారం ఆయన కుమార్తె వివాహం చేశారు. పెళ్లి వేడుకల సమయంలో ఏర్పాటు చేసిన వివిధ సాంసృతిక కార్యక్రమాలు చూసి అతిథులు సంతోషించారు. అందులో ఎలాంటి తప్పులేదని ఆయన సమర్థించుకున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి గత 17 ఏళ్ల నుంచి ఉచిత సామూహిక వివాహాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా ఉచిత సామూహిక వివాహాలు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపిప విషయం మీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత శాసన సభ్యుడు అనీల్ లాడ్ కు లేదని బీజేపీ బళ్లారి జిల్లా అధ్యక్షుడు గురులింగనేగౌడ ఓ ప్రకటనలో మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+