గాలి జనార్దన్ రెడ్డి డబుల్ ధమాకా, ఓటర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మాట ఇస్తే ప్రాణం పోయినా !!

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం ఓ రైంజ్ లో ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత హామీలు, గ్యారెంటీ స్కీమ్ లో విపరీతంగా ఇచ్చేస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం మేము ఇంతకాలం అది చేశాము, ఇది చేశామని, కేంద్రంలో మోదీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తున్నారు. ఇక జేడీఎస్ ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులకు నగదు సహాయం చేస్తామని ప్రకటించింది.

బీజేపీకి గుడ్ బై చెప్పి కొత్త రాజకీయ పార్టీ పెట్టిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూడా ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే రైతులు అందరికి ఒక్కొక్కరిని రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని, నిరుద్యోగులు, పేదులను ఆదుకుంటామని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి హామీలు ఇచ్చారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

Gali Janardhan Reddy has promised to give a double bedroom house to the voters of the Gangavathi constituency.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలోకి ఎంట్రీ ఇవ్వడానికి వీలులేదు. కోప్పళ జిల్లాలోని గంగావతిలో కొత్త ఇంటికి కట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి అక్కడే నివాసం ఉంటున్నారు. తన కొత్త రాజకీయ పార్టీ కేఆర్ పీ నుంచి తాను గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. గంగావతి నుంచే గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు.

ఎన్నికల సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి గంగావతి ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనకు ఓట్లు వేసి గెలిపిస్తే ఈ నియోజక వర్గంలోని అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని, మురికివాడలు తొలగించి పక్కా ఇండ్లు కట్లించి పట్టాలు ఇస్తానని, ప్రతి పేదవాడిని తాను ఆదుకుంటానని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గంగావతి అసెంబ్లీ నియోజక వర్గం ఓటర్లకు హామీ ఇచ్చారు.

సుప్రీం కోర్టు అనుమతి ఇస్తే తాను బళ్లారి వెళ్లిపోతానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నేను ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పనని, తాను గంగావతిలోనే ఉంటానని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా బళ్లారి వెళ్లడానికి గంగావతి నుంచి గంట ప్రయాణం అని, తాను గంగావతిలో ఉండటానికి ఇక్కడే ఇంటిని కూడా నిర్మించుకున్నానని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఆయన నియోజక వర్గం ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానని హామీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+