గూబ పగలగొట్టడం నిమిషం పని, తరువాత ఏం జరుగుతుందో తెలుసా ?, గాలి జనార్దన్ రెడ్డి !
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోప్పళలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగిపై విరుచుకుపడ్డారు మంత్రి శివరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ గూబ మీద దాడి చెయ్యాలని అన్నారని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు.
గూబ గుయ్యమనిపించడం కేవలం ఒక్క నిమిషం మాత్రమే జరుగుతుందని, తరువాత జరగబోయే పరిణాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి శివరాజ్ తంగడగిని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గూబ మీద కొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ గూబ మీద కొట్టాలి అంటూ మంత్రి శివరాజ్ తంగడగి చేసిన వ్యాఖ్యలపై బహిరంగ సభలో విరుచుకుపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి మంత్రి శివరాజ్ తంగడగిపై ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రతి ఇళ్లలో చెడు భావన ఉందని, అందుకే సహనం కోల్పోయిన మంత్రి ప్రధాన మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

కనకగిరి నియోజకవర్గంలోని ప్రజల గౌరవించేలా ఆయన ప్రవర్తించడంలేదని, ఈ ప్రాంతంలోని ప్రజలను చెడుగా చూపించేలా మంత్రి శివరాజ్ మాట్లాడుతున్నారని, అందుకే ఈ ప్రాంతంలోని ప్రజలు మంత్రి శివరాజ్ తంగడికి బుద్దిచెప్పేలా బీజేపీ అభ్యర్థిని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలని గాలి జనార్దన్ రెడ్డి మనవి చేశారు. లోక్ సభ ఎన్నికల్లో గెలవాలని శివరాజ్ తంగడిగ ప్రయత్నిస్తున్నారని, అయితే ప్రజలు ఆయనకు తగినబుద్ది చెబుతారని గాలి జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
గూబ మీద కొట్టడం ఒక్క నిమిషం పని అని, తరువాత ఏం జరుగుతుందో గుర్తు చేసుకుంటే మంత్రి శివరాజ్ తంగడికే మంచిదని గాలి జనార్దన్ రెడ్డి వ్యంగంగా అన్నారు. మంత్రి శివరాజ్ తంగడగి నిరంకుశ పాలనకు, ఆయన మాటలకు ఇక్కడి ప్రజలు ఓట్ల ద్వారా అతనికి సరైన సమాధానం చెప్పాలని, ప్రధాని నరేంద్ర మోదీని గుర్తుపెట్టుకుని ఓటు వేయాలి, దీని వల్ల శివరాజ్ తంగడగి పరువు పోతుందని, మంత్రి పదవి ఊడిపోయి అతను ఇంటికి వెళ్లిపోతారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
ఐదు ఉచిత హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చెయ్యకపోతే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను వీధుల్లోకి తీసుకొచ్చి నిలదీస్తామని గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంతకుముందు నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు మా బలం పెరిగింది. హామీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ ఉచిత హామీ పథకాలు ఎలా నిలిచిపోతాయని గాలి జనార్దన్ రెడ్డి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పల్లకీలో దేవుడి విగ్రహం ఉంటే చాలు అని, బీజేపీ పల్లకీలో మోదీ విగ్రహం ఉందని, అయితే కాంగ్రెస్ పల్లకీలో ఎవరి విగ్రహం లేదని, ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే ధైర్యం కాంగ్రెస్‌కు లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఊరుఊరు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మళ్లీ బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి హుషారుగా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications