Reddy: గాలి జనార్దన్ రెడ్డి, ఒకే దెబ్బకు రెండు పిట్టలు, తమ్ముడికి, బీజేపీకి మైండ్ బ్లాక్, పోటీలో ఎవరో తెలుసా ?
బళ్లారి సిట్టింగ్ ఎమ్మెల్యే,రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి మీద పోటీలో నిలపడానికి ఎవ్వరూ ఊహించని అభ్యర్థిని తెరమీదకు తెచ్చిన గాలి జనార్దన్ రెడ్డి ఇటు ఫ్యామిలీకి,అటు బీజేపీ నాయకులకు దిమ్మ తిరిగిపోయే
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఎన్నికల కమీషన్ డేట్ ఫిక్స్ చెయ్యడమే ఆలస్యం. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే టిక్కెట్లు ధక్కించుకోవాలని నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. సందెట్టో సడేమియా అంటూ మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టడంతో మూడు పార్టీల నాయకులకు చెమటలు పడుతున్నాయి. ఇక గాలి జనార్దన్ రెడ్డి ఆయనకు అడ్డా అయిన బళ్లారిలో పాగా వెయ్యాలని స్కెచ్ వేశారు. బళ్లారి సిట్టింగ్ ఎమ్మెల్యే, రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి మీద పోటీలో నిలపడానికి ఎవ్వరూ ఊహించని అభ్యర్థిని తెరమీదకు తెచ్చిన గాలి జనార్దన్ రెడ్డి ఇటు ఫ్యామిలీకి, అటు బీజేపీ నాయకులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు.

వాడుకుని వదిలేశారా ?
బీజేపీకి గుడ్ బై చెప్పి కల్యాణ రాజ్య ప్రగతి అనే కొత్త రాజకీయ పార్టీ పెట్టిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రాజకీయంగా తనను దెబ్బ తీసిన కొందరికి బుద్ది చెప్పాలని, ఇంతకాలం తనను వాడుకుని వదిలేసిన వారికి తన సత్తా చూపించాలని గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టారని కొందరు రాజకీయ ప్రముఖులు అంటున్నారు.

సొంతపార్టీ అయినా గాలికి నో చాన్స్
కల్యాణ రాజ్య ప్రగతి సొంత పార్టీ అయినా గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి సిటీలో పోటీ చెయ్యలేకపోతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగుపెట్టడానికి వీలులేదు. బళ్లారి అడ్డగా పెట్టుకుని కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు అదే బళ్లారిలో సొంత పార్టీ తరపున పొటీ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది.

రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు ఎమ్మెల్యే
గాలి జనార్దన్ రెడ్డికి బళ్లారి కంచుకోట అని కొత్తగా చెప్పనవసరం లేదు. అలాంటి బళ్లారి సిటీ నియోజక వర్గం ఎమ్మెల్యేగా గాలి జనార్దన్ రెడ్డి సొంత తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బళ్లారి సిటీ నియోజక వర్గం నుంచి తాను మరోసారి పోటీ చేస్తానని, బీజేపీ టిక్కెట్ మీదే తాను బరిలో ఉంటానని ఇటీవల గాలి సోమశేఖర్ రెడ్డి బహిరంగంగా చెప్పారు.

అన్నను అన్నిమాటలు అంటే ఊరికే ఉంటాడా ?
తన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టి తప్పు చేశారని, రాజకీయాల్లో ఓపిక ఉండాలని ఇటీవల గాలి సోమశేఖర్ రెడ్డి ఆయన అన్న గాలి జనార్దన్ రెడ్డికి మీడియా ముందే శ్రీరంగనీతులు చెప్పారు. బళ్లారిలో తాను పోటీ చెయ్యలేకపోయినా తన పార్టీ తరపున మంచి అభ్యర్థిని బరిలో నిలిపాలని గాలి జనార్దన్ రెడ్డి ఆలోచించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి అధికారికంగా ఆయన పార్టీ టిక్కెట్ ఎవరికి అని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.

గాలి జనార్దన్ రెడ్డి భార్య ఎంట్రీ
గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీలో ముగ్గురు సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. గాలి కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే, గాలి సోమశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేనే. ఇక గాలి ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు కర్ణాటక మంత్రి, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి భార్య గాలి లక్ష్మీ అరుణ బళ్లారి సిటీ నియోజక వర్గం నుంచి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ నుంచి పోటీ చెయ్యడానికి రంగం సిద్దం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

తమ్ముడుఅయినా సరే.. .నా నిర్ణయం అదే
తన భార్య లక్ష్మీ అరుణ బళ్లారి సిటీ పోటీ చేస్తోందని గాలి జనార్దన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. బళ్లారి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే నా సొంత తమ్ముడు అయినా, ఎవరైనా సరే, మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం మా కర్తవ్యం, అందుకే నా సతీమణిని అక్కడి నుంచి పోటీ చేయిస్తానని గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. తాను ఎవరినో ఓడించాలని అక్కడ నా భార్యను పోటీలో దింపడం లేదు, మా పార్టీ విజయం మాకు ముఖ్యం అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

రాజకీయాలు వేరే... ఫ్యామిలీ వేరు బ్రదర్
ఒకరి మీద నాకు కక్ష, పగ లేదు. అలా అని గెలిచేచోట మా పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా చూస్తూ ఉండలేము కదా. రాజకీయాలు వేలు, ఫ్యామిలీ వేరు అని గాలి జనార్దన్ రెడ్డి కుండల బద్దలుకొట్టినట్లు చెప్పారు. బళ్లారి సిట్టింగ్ ఎమ్మెల్యే, రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు గాలి సోమశేఖర రెడ్డి మీద పోటీలో నిలపడానికి ఎవ్వరూ ఊహించని అభ్యర్థిగా భార్య లక్ష్మీ అరుణను తెరమీదకు తెచ్చిన గాలి జనార్దన్ రెడ్డి ఇటు ఫ్యామిలీకి, అటు బీజేపీ నాయకులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications