స్వతంత్ర అభ్యర్థిగా గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు పోటీ ? బీజేపీకి సినిమా, ఇబ్బంది పెట్టి!

బళ్లారి/బెంగళూరు: తమ శక్తి సామర్థ్యాలు, అభిమానుల్లో తమ పలుకుబడి ఎలా ఉంటుందో బీజేపీకి రుచి చూపించాలని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సిద్దం అయ్యారని తెలిసింది. బళ్లారి శాసన సభ నియోజక వర్గం టిక్కెట్ తమ సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డికి ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి విజయం సాధించాలని గాలి జనార్దన్ రెడ్డి ఆలోచిస్తున్నారని బళ్లారిలో ఆయన మద్దతుదారులు జోరుగా చర్చించుకుంటున్నారు.

తమాషా కాదు !

తమాషా కాదు !

బళ్లారి శాసన సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గాలి సోమశేఖర్ రెడ్డి లేదా గాలి జనార్దన్ రెడ్డి పోటీ చెయ్యడం అంత సులభమైన విషయం కాదు. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు బదులుగా బళ్లారికి చెందిన వైద్యుల కుటుంబం మీద ఆదారపడాలని బీజేపీలోని కొందరు నాయకులు అంటున్నారు.

గాలి బ్రదర్స్ రహస్యాలు !

గాలి బ్రదర్స్ రహస్యాలు !

బీజేపీకి ఎదురుతిరిగి గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డిలో ఎవరైనా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ముందు వెనుక ఆలోచించకుండా వారి రహస్యాలు బయటపెట్టి మరింత ఇబ్బంది సృష్టించడానికి ఆ పార్టీ నాయకులు వెనకడుగు వెయ్యరని తెలిసింది.

బీజేపీకి భారీ దెబ్బ !

బీజేపీకి భారీ దెబ్బ !

గాలి జనార్దన్ రెడ్డి సోదరులు బీజేపీకి దూరం అయితే బళ్లారి శాసన సభ నియోజక వర్గం, లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల్లో బీజేపీకి భారీ దెబ్బపడుతోందని ఆ పార్టీలోని కొందరు నాయకులు ఆందోళన చెందుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి అభిమానులు, మద్దతుదారులు ఎదురుతిరిగితే మొదటికే మోసం వస్తోందని బీజేపీలోని కొందరు నాయకులు ఆందోళన చెందుతోంది.

బీజేపీ ఆలోచన !

బీజేపీ ఆలోచన !

గాలి సోమశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దగా ఆరోపణలు లేకపోయినా ఆయన్ను దూరం చేసుకోవడానికి బీజేపీలోని కొందరు నాయకులకు ఇష్టం లేదు. అయితే గాలి సోమశేఖర్ రెడ్డి శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇచ్చే విషయంలో ఎలాంటి ప్రకటనట చెయ్యకుండా బీజేపీ నాయకులు ఇంకా ఆలోచిస్తున్నారు.

శ్రీరాములు, గాలి సోమశేఖర్ రెడ్డి

శ్రీరాములు, గాలి సోమశేఖర్ రెడ్డి

బళ్లారి ఎంపీ శ్రీరాములు, గాలి సోమశేఖర్ రెడ్డి కలిసి పని చేస్తున్నారని, వారి వలన పార్టీలో ఎలాంటి సమస్య లేదని, బళ్లారి జిల్లాలోని అన్ని శాసన సభ నియోజక వర్గాల్లో విజయం సాధిస్తామని, అయితే గాలి జనార్దన్ రెడ్డి విషయంలో బీజేపీలో ఇంకా చర్చ జరగలేదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మీడియాకు చెప్పారు.

గాలి కరుణాకర రెడ్డి

గాలి కరుణాకర రెడ్డి


గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి మీద ఎలాంటి కేసులు, ఆరోపణలు లేవు. బళ్లారి జిల్లా పరపనహళ్ళి నుంచి పోటీ చెయ్యడానికి గాలి కరుణాకర్ రెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. 22 ఏళ్లుగా తాను బీజేపీలో ఉన్నానని, తన శక్తి సామర్థ్యాలు ఏమిటో పార్టీ నాయకులకు తెలుసని, కచ్చితంగా తనకు టిక్కెట్ ఇస్తారని గాలి కరుణాకర్ రెడ్డి ధీమాతో ఉన్నారు.

అమిత్ షా క్లారిటీ

అమిత్ షా క్లారిటీ

గాలి జనార్దన్ రెడ్డికి, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఇటీవల మైసూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా ముందు కుండలుబద్దలుకొట్టి చెప్పారు. ఈ విషయంపై గాలి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలపై తాను స్పంధించనని, పరపనహళ్ళిలో తన తరపున గాలి జనార్దన్ రెడ్డి ఎలాంటి పరిస్థితిలో ప్రచారం చెయ్యరని, అలాంటి అవకాశం తాను ఇవ్వనని అన్నారు.

గాలి బ్రదర్ కు పరోక్ష హెచ్చరిక !

గాలి బ్రదర్ కు పరోక్ష హెచ్చరిక !

గాలి జనార్దన్ రెడ్డితో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోరాదని బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు గాలి కరుణాకర్ రెడ్డికి సూచించారని తెలిసింది. ఇక గాలి జనార్దన్ రెడ్డి సైతం బీజేపీలో మరోసారి ప్రత్యక్షంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇప్పట్లో అవకాశం లేదని ఆ పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+