దేవుడా: గాలి కుమార్తె పెళ్లి చీర ఇన్ని కోట్లా ?

బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా గాలి కుమార్తె పెళ్లి గురించి వారికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహ శుభలేఖతో అందరిని ఆకర్షించారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లిలో ప్రతి ఘట్టాన్ని అత్యంత ఘనంగా చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి పెళ్లి ఖర్చు ఎంత పెడుతున్నారో అనే విషయం అందరికి తెలిసిందే.

Gali Janardhana Reddy daughter's marriage arrangements in Bengaluru

అయితే పెళ్లిపీటలమీద కుర్చునే సమయంలో బ్రహ్మిణి వేసుకునే బంగారు నగలతో పాటు పట్టుచీర చాల ఖరీదైనవి అని తెలిసింది. ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యేక శ్రద్ధతో చాల రోజుల నుంచి బ్రహ్మిణికి ఖరీదైన పట్టుచీర తయారు చేయించారని తెలిసింది.

ఆపట్టుచీర ధర దాదాపు రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతే కాకుండా గాలి జనార్దన్ రెడ్డి తన ఏకైక ముద్దుల కూతురు కోసం ప్రత్యేకంగా దాదాపు రూ. 70 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు నగలు గతంలోనే చేయించారని ఆయన వర్గీయులు అంటున్నారు.

Gali Janardhana Reddy daughter's marriage arrangements in Bengaluru

ఎన్నో సంచలనాలకు గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి వేడుక వేదిక అయ్యింది. బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని 36 ఎకరాల స్థలంలో సినిమా సెట్టింగ్స్ తలదన్నే విధంగా విజయనగర సామ్రాజ్యం ఎలా ఉంటుందో అలాంటి సెట్టింగ్స్ వేయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+