వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ఎన్నికలు: గాలి జనార్ధన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం షాక్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బళ్లారి: మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి బీజేపీ షాకిచ్చింది. తన అనుచరులకు పలువురికి నుంచి టికెట్లు ఇప్పించుకున్న గాలి.. గత నాలుగు రోజులుగా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారట.

బాదామి నియోజకవర్గంలో గాలి ప్రధాన అనుచరుడు శ్రీరాములు బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో గాలి మాట్లాడుతూ.. బాదామిలో సిద్ధ రావణ (సిద్ధరామయ్య)ను మా శ్రీరాముడు సంహరిస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. గాలి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.

 Gali Janardhana Reddy leaves Molakalmuru following orders from BJP high command

మరోవైపు, బీజేపీలోని కొందరు నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలంటూ గాలిని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది.

శ్రీరాములు నామినేషన్ వేసిన సమయంలో జరిగిన ర్యాలీలో శ్రీరాములు పక్కనే గాలి ఉన్నారు. ఏప్రిల్ 21న జరిగిన ఓ సభలో యెడ్యూరప్పతో కలిసి వేదిక కూడా పంచుకున్నారు.

English summary
Mining baron and former Karnataka Minister Gali Janardhana Reddy has left Molakalmuru in Chitradurga reportedly after an order from BJP's central leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X