గాలి సంచలన నిర్ణయం ! కుమార్తె పెళ్లి కోసమేనా ?

బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన ఏకైక కుమార్తె పెళ్లి ఘనంగా నిర్వహించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇప్పుడు తనను టార్గెట్ చేసి జైలుపాలు చేసి విమర్శించిన వారికి మళ్లీ అలాంటి అవకాశం ఇవ్వరాదని గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

కుమార్తె పెళ్లి ఎలా చేసినా తాను అంటే గిట్టని వారు మళ్లీ విమర్శలకు దిగుతారని గాలి జనార్దన్ రెడ్డి పసిగట్టారు. అందుకే హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డితో తన కుమార్తె పెళ్లి నిశ్చయం అయిన వెంటనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

 Gali Janardhana Reddy's daughter’s wedding celebrations in Bengaluru

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు తీసుకుని తన కుమార్తె బ్రహ్మిణి వివాహం రంగరంగ వైభవంగా చెయ్యాలని ఆరు నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

పెళ్లి ఖర్చుల కోసం గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని కొన్ని ఆస్తులు విక్రయించారని, మరి కొన్ని ఆస్తులను కుదవ పెట్టి నగదు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఘనంగా పెళ్లి చెయ్యడానికి ఆయన సన్నిహితులు సైతం పూర్తిగా సహకరించారని సమాచారం.

ఆరు నెలల క్రితమే పెళ్లికి ఏమేమి అవసరం అవుతాయో అన్ని సమకూర్చుకున్నారని, అప్పుడే అందరికి డబ్బులు చెల్లించి ఇప్పుడు నిశ్చింతగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు.

తన కుమార్తె పెళ్లి వేడుకలు చరిత్రలో నిలిచిపోవడానికి ఆయన తన ఆస్తులను వదులుకోవడానికి సిద్దం అయ్యారని గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితులు అంటున్నారు. ఎవరైనా తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చెయ్యాలనే అనుకుంటారు. అయితే గాలి మాత్రం తన అనుచరులు, అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయేలా తన కుమార్తె పెళ్లి చేసి చూపించారు.

 Gali Janardhana Reddy's daughter’s wedding celebrations in Bengaluru

గాలి జనార్దన్ రెడ్డి, ఆయన ప్రాణమిత్రుడు శ్రీరాములు గతంలో బళ్లారిలో కొన్ని వేల మందికి ఉచిత సామూహిక వివాహాలు చేశారు. వారి పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు మొత్తం వీరే చూసుకున్నారు. ఇప్పుడు సొంత ఇంటిలో గాలి తన కుమార్తె బ్రహ్మిణి వివాహం రంగరంగ వైభవంగా చేసి చూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+