గాలి పెళ్లిపై సీఎం స్పందన: అరెస్టు చెయ్యండి !

బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పెళ్లి విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. సార్ మీరు గాలి జనార్దన్ రెడ్డి పెళ్లికి ఎందుకు వెళ్లలేదు అని మీడియా ఆయనను ప్రశ్నించింది.

Gali Janardhana Reddy

ఆ సమయంలో సిద్దరామయ్య తనదైన శైలిలో స్పందించారు. జనార్దన్ రెడ్డి పెళ్లి గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటారు ఎందుకు ? అదేమైనా పెద్ద వార్తనా ? పెద్ద విషయమా ? అని మండిపడ్డారు.

జనార్దన్ రెడ్డి పెళ్లి విషయంపై పదేపదే ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ఒక్కరే పెళ్లిళ్లు చేస్తున్నారా ? వేలాధి మంది వారి కుటుంబ సభ్యులు పెళ్లిళ్లు చేస్తుంటారు కదా, అది మీకు తెలీదా అంటూ సీఎం సిద్దరామయ్య మీడియాను ప్రశ్నించారు.

Gali Janardhana Reddy

అరెస్టు చెయ్యాలని ఆప్ ఆందోళన

దేశంలో అవినీతిని, నల్లధనాన్ని అరికడుతాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు అవినీతి డబ్బుతో గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి చేస్తుంటే అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు ఆరోపించారు.

అక్రమ సంపాదనతో గాలి జనార్దన్ రెడ్డి ఆయన కుమార్తె పెళ్లి చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆప్ కార్యకర్తలు బెంగళూరులో ధర్నా నిర్వహించి బీజేపీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి బీజేపీ నాయకులు హాజరైనా కేంద్ర ప్రభుత్వం వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దేశంలోని అవినీతి అంతా బీజేపీ నాయకుల్లోనే ఉందని మండిపడ్డారు. ఐటీ శాఖ అధికారులు గాలి ఇంట జరిగిన పెళ్లి విషయంపై విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు.

అక్రమాస్తుల కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు అయిన తరువాత ఆయన ఆస్తులను సీబీఐ జప్తు చేసిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలి జనార్దన్ రెడ్డి ఆయన కుమార్తె వివాహాం ఎలా చేశారు ? అనే విషయంపై ఐటీ అధికారులు ఆరా తీయ్యాలని, గాలిని అరెస్టు చెయ్యాలని ఆప్ నాయకులు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+