గాలి పెళ్లికి బీజేపీ, కాంగ్రెస్ ప్రముఖులు: బ్రహ్మి సందడి

బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు హాజరైనారు. రాజకీయాలు వేరు, శుభకార్యాలు వేరు అని పలు పార్టీల నాయకులు అన్నారు.

బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెళ్లి మండపంలో నిలువెత్తు ఏడుకోండస్వామి ఫోటో ముందు బుధవారం ఉదయం 10.06 గంటల సమయంలో హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి మెడలో తాళి కట్టి తన ధర్మపత్నిని చేసుకున్నారు.

ఈ సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప, కర్ణాటక హోం శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, ఇందన శాఖా మంత్రి డీ.కే. శివకుమార్, మాజీ మంత్రులు చెలువరాయ స్వామి, రేణుకాచార్య, జేడీఎస్ పార్టీ శాసన సభ్యులు జమీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Gali Janrdhan Reddy and Karnataka BJP president BS Yeddyurappa

గాలి జనార్దన్ రెడ్డి, ఆయన ప్రాణ స్నేహితుడు, బీజేపీ ఎంపీ శ్రీరాములు ప్రముఖులు అందరిని సాధరంగా ఆహ్వానించారు. పలు పార్టీల నాయకులు రాజీవ్ రెడ్డి, బ్రహ్మిణిలను ఆశిర్వధించారు. అదే విధంగా తెలుగు, కన్నడ, తమిళ సినీ రంగాలకు చెందిన పలువురు ఈ శుభకార్యానికి హాజరైనారు.

బహుబాష నటుడు, నిర్మాత విషాల్, కామిడి కింగ్ బ్రంహ్మానందం, సాయికుమార్, ఆయన కుమారుడు ఆది, బహుబాష నటీ రాధిక, మీనా, శ్రీయ, నిరోష, కన్నడ క్రేజీస్టార్ రవిచంద్రన్, ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ తదితరులు గాలి ఇంటి జరిగిన పెళ్లికి హాజరై నవదంపతులను ఆశిర్వధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+