క్లినిక్‌లో డాక్టర్ శృంగార లీలలు: చిత్రీకరించిన నర్సు.. బ్లాక్ మెయిల్‌తో ఇలా!

డాక్టర్ మళ్లీ ఎప్పుడైనా తనపై విరుచుకుపడితే ఆ వీడియోను ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ చేయాలనుకుంది. కానీ, అప్పటికే ఆమె మొబైల్‌లో ఆ వీడియోను గమనించిన బాయ్‌ఫ్రెండ్ అశోక్ జాదవ్ డాక్టర్‌ను బ్లాక్‌మెయిల్ చేయాలని

ముంబై: ఓ డాక్టర్ తన క్లినిక్‌లో సాగించిన రాసలీలలను రహస్యంగా చిత్రీకరించిన నర్సు.. బాయ్ ఫ్రెండుతో కలిసి బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వీడియోలను ఇంటర్నెట్‌లో పెడుతామంటూ బెదిరించడంతో.. దాదాపు రూ.1కోటి దాకా సమర్పించుకున్నాడు. అయినా.. బెదిరింపులకు ఫుల్ స్టాప్ పడకపోవడంతో.. ఇక చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన 56ఏళ్ల డాక్టర్ ఒకరు నగరంలోనే క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఇదే క్లినిక్‌లో పనిచేస్తోన్న ఓ నర్సు.. కొంతకాలంగా డాక్టర్ పై గుర్రుగా ఉంది. ఇటీవల డాక్టర్ తన స్నేహితురాలితో క్లినిక్ లోనే శృంగారంలో పాల్గొనగా.. ఎవరికీ అనుమానం రాకుండా నర్సు దాన్ని రహస్యంగా చిత్రీకరించింది.

GANG EXTORTS RS 1CRORE FROM DOCTOR ‘FILMED IN ROMANTIC ENCOUNTER’

డాక్టర్ మళ్లీ ఎప్పుడైనా తనపై విరుచుకుపడితే ఆ వీడియోను ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ చేయాలనుకుంది. కానీ, అప్పటికే ఆమె మొబైల్‌లో ఆ వీడియోను గమనించిన బాయ్‌ఫ్రెండ్ అశోక్ జాదవ్ డాక్టర్‌ను బ్లాక్‌మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

తనకు పరిచయమున్న ముఠాతో కలిసి డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.. బ్లాక్ మెయిల్‌కు తలొగ్గిన సదరు డాక్టర్.. గతంలో రెండు దఫాలుగా రూ.1కోటి సమర్పించుకున్నాడు. డాక్టర్ బలహీనతను మరింత క్యాష్ చేసుకోవాలని భావించిన ముఠా.. గత శుక్రవారం మరోసారి ఆయన్ను డబ్బు కోసం బెదిరించారు. తుపాకీ గురిపెట్టి మరీ డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో డాక్టర్ వణికిపోయాడు.

ఆపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అశోక్ జాదవ్‌ను అరెస్టు చేశారు. నర్సు పరారీలో ఉండగా.. అశోక్ జాదవ్‌తో పాటు చోటారాజన్, అశ్వినీ నాయక్ గ్యాంగ్ ల హస్తం ఇందులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు మహిళలతో పాటు 8మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు గతంలోను నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+