వివాహితపై గ్యాంగ్ రేప్ : భర్త కళ్లెదుటే దారుణం..
నగర శివారులోని హుల్లాహల్లి గ్రామానికి చెందిన 28 ఏళ్ల వివాహితపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
బెంగుళూరు : నగర శివారులోని హుల్లాహల్లి గ్రామానికి చెందిన 28 ఏళ్ల వివాహితపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. భర్తను కత్తితో బెదిరించి వివాహిత కుమారుడి ఎదుటే ఆమెపై అత్యాచారం చేశారు.

విషయం స్థానికులకు తెలియడంతో.. వారంతా హుటాహుటిన బాధితురాలి ఇంటికి పరిగెత్తారు. అప్పటికే దుండగులు పారిపోవడంతో.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుధవారం నాడు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications