బిజెపిలోకి ప్రముఖ సంగీత దర్శకుడు అమరన్
చెన్నై: ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన చేరనున్నట్లు తెలిసింది.
తొలిసారి తమిళనాడు పర్యటనకు వస్తున్న అమిత్ షా ఓ బహిరంగ సభలో పాల్గొంటున్న సందర్భంగా గంగై అమరన్‌ను పార్టీలో చేర్చుకోడానికి తమిళనాడు బిజెపి శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసుకున్నాయి.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతోనూ, తమిళనాడు శాఖ అధ్యక్షుడు తమిళసై సౌందరరాజ్ తోనూ ఇప్పటికే గంగై అమరన్ మాట్లాడారు. గంగై అమరన్ కేవలం సంగీత దర్శకుడే కాదు.. పాటల రచయిత, సినిమా నిర్మాతగా కూడా వ్యవహరించారు.
తమిళనాడు రాష్ట్రంలో అన్నాడిఎంకె, డిఎంకెలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బిజెపి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీలో ప్రముఖులను చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది బిజెపి.
కాగా, గంగై అమరన్ తోపాటు పలువురు ప్రముఖులు కూడా శనివారం జరిగే కార్యక్రమంలో పార్టీలో చేరతారని బిజెపి సీనియర్ నాయడొకరు చెప్పారు.












Click it and Unblock the Notifications