Minor girl: దీపావళి రోజు బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్, కామాంధుల నరాలు కట్, జీవితంలో మరో ఆడదాని వైపు

బెంగళూరు/ కోలారు/ కేజీఎఫ్: దీపావళి పండగ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తామని, శవం కూడా కనిపించకుండా చేస్తామని మైనర్ బాలికను బెదిరించారు. తన మీద నలుగురు అత్యాచారం చేశారని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధులను అరెస్టు చేసిన పోలీసులు వారి నరాలు బయటకు లాగేశారు. జీవితంలో మరో ఆడదాని వైపు కన్నెత్తకుండా చేశారు.

 పండగ రోజు బాలిక కిడ్నాప్

పండగ రోజు బాలిక కిడ్నాప్

కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లా సమీపంలోని బేతమంగళం సమీపంలోని హంగళ గ్రామంలో 13 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నది. ఈనెల 15వ తేదీ ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ దీపావళి పండుగ బిజీలో ఉండటంతో బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సమయం కోసం వేచి చూస్తున్న అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు.

 ఊరి సమీపంలో గ్యాంగ్ రేప్

ఊరి సమీపంలో గ్యాంగ్ రేప్

బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు గ్రామం సమీపంలోని పాడుపడిన ఓ ఇంటిలోకి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు బాలికను బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. కామం తీర్చుకున్న కామాంధులు ఈ విషయం బయటకు చెబితే రేపే నిన్ను చంపేసి శవాన్ని మాయం చేస్తామని, మర్యాదగా ఏమీ జరగనట్లు ఉండిపోవాలని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.

 కామాంధుల నరాలు కట్

కామాంధుల నరాలు కట్

ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. సోమవారం బాధితురాలి తండ్రి బేతమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసిన పోలీసులు దర్యాప్తు చేసి బాలిక నివాసం ఉంటున్న గ్రామంలో నివాసం ఉంటున్న హరీష్ (28), రఘు (23), సోహెల్ (19), జగదీష్ (19) అనే నలుగురు కామాంధులను అరెస్టు చేసి వారి నరాలు బయటకులాగేశారు.

 జీవితంలో మరో ఆడదాని గురించి ఆలోచించకూడదు

జీవితంలో మరో ఆడదాని గురించి ఆలోచించకూడదు

నిందితులు హరీష్ (28), రఘు (23), సోహెల్ (19), జగదీష్ (19) లపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని బేతమంగళ పోలీసులు చెప్పారు. నిందితులు వారి జీవితంలో మరో ఆడదాని గురించి ఆలోచించకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కోలారు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నలుగురు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి బాలికకు వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నామని బేతమంగళ పోలీసులు తెలిపారు. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరగడంతో కర్ణాటకలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+