పార్టీ ఇచ్చాడు! పరారయ్యాడు! యూపీ పోలీసులకు షాకిచ్చిన ఖైదీ
యూపీ : పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నేరస్థులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొందరు పోలీసులను పల్టీ కొట్టించడంలో సక్సెస్ అయితే మరికొందరు దొరికిపోయి మరిన్ని కేసుల్లో ఇరుక్కుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ఖైదీ పోలీసుల చెర నుంచి తప్పించుకునేందుకు వేసిన మాస్టర్ ప్లాన్‌తో పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. ఒక ఇన్స్‌పెక్టర్ సహా ఆరుగురు కానిస్టేబుళ్లు కటకటాలు లెక్కపెడుతున్నారు.

పోలీసులకు మందు పార్టీ
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బదాన్ సింగ్ ఓ గ్యాంగ్‌స్టర్. 1996లో ఓ లాయర్ హత్య కేసులో గతేడాది యావజ్జీవశిక్ష పడటంతో ఫతేనగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై మరో పది కేసులు పెండింగ్‌లో ఉండటంతో వాటి విచారణ నిమిత్తం పోలీసులు అతన్ని ఘజియాబాద్ కోర్టుకు తీసుకెళ్తుంటారు. ఎప్పటిలాగే గురువారం కూడా ఆరుగురు ఎస్కార్ట్ పోలీసులు బదాన్ సింగ్‌ను కోర్టుకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన అతను లిక్కర్ పార్టీ అరేంజ్ చేశానంటూ పోలీసులను మీరట్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన అనుచరులతో కలిసి వారికి మందుపార్టీ ఇచ్చాడు.

మద్యం మత్తులో పోలీసులు, పరారీలో నిందితుడు
హోటల్‌లో మందు తాగిన పోలీసులు స్పృహ కోల్పోయారు. ఇదే అదునుగా బదాన్ సింగ్ తన అనుచరులతో పరారయ్యాడు. దాదాపు 3 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన పోలీసులు జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. విషయాన్ని పై అధికారులకు చెప్పారు.

పోలీసుల అరెస్ట్
గ్యాంగ్‌స్టర్ బదాన్‌సింగ్ దెబ్బకు పోలీసులే పోలీసులను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విధి నిర్వాహణలో నిరక్ష్యంగా వ్యవహరించిన ఇన్స్‌పెక్టర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు త్వరలోనే బదాన్‌ను పట్టుకుంటామని ప్రకటించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications