Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mostwanted: ఇద్దరు గ్యాంగ్ స్టర్లకు పంగనామాలు పెట్టిన మరో గ్యాంగ్ స్టర్ అరెస్టు, భారత్ వస్తే అంతే !

బెంగళూరు: ఇద్దరు మాఫియా డాన్ ల దగ్గర శిష్యుడిగా పని చేసిన వ్యక్తి తరువాత అతనే ఓ గ్యాంగ్ రెడీ చేసుకుని గ్యాంగ్ స్టర్ అయ్యాడు. విదేశాల్లో మకాం వేసిన ఈ గ్యాంగ్ స్టర్ అతని అనుచరులతో ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ ను చంపేస్తామని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. విదేశాల నుంచి చక్రం తిప్పుతున్న ఆ గ్యాంగ్ స్టర్ ను పట్టుకోవడానికి భారత్ పోలీసులు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్ పోల్ సహాయంతో పిలిప్పీన్స్ లో తలదాచుకున్న ఆ గ్యాంగ్ స్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. మాఫియా డాన్ లు చోటా రాజన్, రవి పూజారి దగ్గర పనిచేసిన అనుభంతో క్రిమినల్ మైండ్ ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ ను ఇప్పుడు భారత్ పిలుచుకుని రావడానికి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారని తెలిసింది.

ఇద్దరు మాఫియా డాన్ ల శిష్యుడు

ఇద్దరు మాఫియా డాన్ ల శిష్యుడు

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సురేష్ పూజారి అలియాస్ సురేష్ బాయ్ మీద అనేక కేసులు ఉన్నాయి. మాఫియా డాన్ చోటా రాజన్ దగ్గర మొదట సురేష్ పూజారి చేశాడు. చోటా రాజన్ శిష్యుడిగా పని చేస్తున్న సురేష్ పూజారి తరువాత కర్ణాటకు చెందిన మరో మాఫియా డాన్ రవి పూజారి దగ్గర చేరాడు.

 రెండో గురువుకు హ్యాండ్ ఇచ్చాడు

రెండో గురువుకు హ్యాండ్ ఇచ్చాడు

మాఫియా డాన్ చోటా రాజన్ కు హ్యాండ్ ఇచ్చిన తరువాత రవి పూజారి దగ్గర పని చేసుకుంటున్న సురేష్ పూజారి తరువాత కొందరితో అతను సన్నిహితంగా ఉన్నాడు. రెండో గురువు రవి పూజారితో తేడాలు రావడంతో 10 సంవత్సరాల క్రితం అతనికి హ్యాండ్ ఇచ్చాడు. కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకున్న సురేష్ పూజారి తరువాత అతనే మాఫియా డాన్ అయిపోయాడు.

 బిగ్ షాట్స్ ను టార్గెట్ చేసిన సురేష్ పూజారి

బిగ్ షాట్స్ ను టార్గెట్ చేసిన సురేష్ పూజారి

ఇద్దరు మాఫియా డాన్ ల దగ్గర శిష్యుడిగా పని చేసిన సురేష్ పూజారి తరువాత అతనే ఓ గ్యాంగ్ రెడీ చేసుకుని గ్యాంగ్ స్టర్ అయిపోయి రెచ్చిపోయాడు. విదేశాల్లో మకాం వేసిన గ్యాంగ్ స్టర్ సురేష్ పూజారి అతని అనుచరులను అడ్డం పెట్టుకుని కర్ణాటక, మహారాష్ట్రాలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ ను చంపేస్తామని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు.

 ఆ రోజు విదేశాలకు ఎస్కేప్

ఆ రోజు విదేశాలకు ఎస్కేప్

మొదట కర్ణాటకలోనే ఉంటూ మాఫీయా కార్యకలాపాలు చేసిన సురేష్ పూజారి మీద అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. రాత్రికి రాత్రే భారత్ నుంచి చెక్కేసిన సురేష్ పూజారి చాలా సంవత్సరాల నుంచి విదేశాల్లో తిరుగుతున్నాడు. ప్రతినిత్యం విదేశాల్లో కూడా మకాం మార్చుకున్న సురేష్ పూజారి మీద కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో అనేక కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    Congress MLA Jeevan Reddy Fires On KCR Govt Over Gangster Nayeem Case - Oneindia Telugu
    పక్కా సమాచారంతో అరెస్టు

    పక్కా సమాచారంతో అరెస్టు


    విదేశాల నుంచి చక్రం తిప్పుతున్న గ్యాంగ్ స్టర్ సురేష్ పూజారిని పట్టుకోవడానికి భారత్ పోలీసులు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సురేష్ పూజారి పిలిప్పీన్స్ లో తలదాచుకున్నాడని బారత్ పోలీసులకు సమాచారం అందింది. ఇంటర్ పోల్ సహాయంతో పిలిపెన్స్ లో తలదాచుకున్న గ్యాంగ్ స్టర్ సురేష్ పూజారిని పోలీసులు పట్టుకున్నారు. మాఫియా డాన్ లు చోటా రాజన్, రవి పూజారి దగ్గర పనిచేసిన అనుభంతో క్రిమినల్ మైండ్ ఉన్న గ్యాంగ్ స్టర్ సురేష్ పూజారిని భారత్ పిలుచుకుని రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+