GATE 2023 ఫలితాలు విడుదల: ఇలా తెలుసుకోండి, 21న స్కోర్ కార్డులు

ప్రసిద్ధ ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యూయేట్ అప్లిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ 2023(GATE-2023) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.

న్యూఢిల్లీ: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రసిద్ధ ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యూయేట్ అప్లిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ 2023(GATE-2023) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate.iitk.ac.in లో లాగిన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

పెద్ద ఎత్తున అభ్యర్థులు ఒక్కసారిగా ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను ఆశ్రయించడంతో సాంకేతిక కారణాలతో సర్వర్‌లో సమస్యలు తలెత్తి అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా, గేట్ స్కోర్‌కార్డులు మార్చి 21న విడుదల కానున్నాయి. ప్రస్తుతానికి, అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారా లేదా అని మాత్రమే తనిఖీ చేయవచ్చు. కాగా, గేట్ పరీక్షలో సాధించిన స్కోరుతో దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెల నెలా స్కాలర్ షిప్‌లు కూడా పొందవచ్చు. ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఉపయోగపడుతుంది.

GATE 2023 Result released: get scorecard on March 21

కాగా, గత ఏడాది ఆగస్టు 30 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 7 వరకు కొనసాగింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఆన్సర్ కీని ఫిబ్రవరి 21న విడుదల చేశారు. 22 నుంచి 25 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫలితాలను ప్రకటించారు. మార్చి 21 నుంచి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గేట్ 2023 ఫలితాలను ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి..

పరీక్షకు హాజరైన అభ్యర్థులు గేట్ అధికారిక వెబ్‌సైట్‌ gate.iitk.ac.inకు వెళ్లాలి.
హోమ్‌పేజీలో క్రిందికి స్క్రోల్ చేసి, దరఖాస్తుదారు లాగిన్ ట్యాబ్‌కు వెళ్లండి
తర్వాత దశలో, అవసరమైన ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి
ఫలితం స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది
ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి
భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింటవుట్ తీసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+