కన్నడ ఎడిటర్ గౌరి లంకేష్ హత్య: సీసీకెమెరాల్లో, ప్రత్యక్ష సాక్షులు లేరు: డీజీపీ దత్త !
Recommended Video

బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మతసామరస్య వేదిక నాయకురాలు గౌరి లంకేష్ (55) హత్య కేసులో బెంగళూరు పోలీసులు కీలక సాక్షాధారాలు సేకరించారు. గౌరి లంకేష్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.
గౌరి లంకేష్ ఇంటిలో ఉన్న సీసీ కెమెరాల డీవీఆర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీలలో రికార్డు అయిన దృశ్యాలలో వెలుతురు తక్కువగా ఉండటంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

గౌరి లంకేష్ నివాసం ఉంటున్న రహదారిలోని అన్ని ఇండ్లుతో పాటు ఆ రహదారిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గౌరి లంకేష్ హత్యకు గురైన సమయంలో ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఎవ్వరూ లేరని, రివాల్వర్ తో కాల్చిన సమయంలో పెద్దగా శభ్ధం రావడంతో చుట్టు పక్కల వారు బయటకు వచ్చి చూశారని కర్ణాటక డీజీపీ రూప్ కుమార్ దత్త (ఆర్.కే. దత్త) బుధవారం మీడియాకు చెప్పారు.

గౌరి లంకేష్ ను హత్య చేసిన నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు అంటున్నారు. గౌరి లంకేష్ నివాసం ఉంటున్న ఇంటి చుట్టు పక్కల రహదారులలో ఏర్పాటు చేసిన అన్ని సీసీకెమెరాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.
-
కొరత వేళ గ్యాస్ బుకింగ్‌లపై కొత్త పరిమితి, ఇక నుంచి...!! -
బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్ -
దేశంలోని ఈ అడవుల్లో పర్యటిస్తే మాటల్లో చెప్పలేని అనుభూతి..! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల












Click it and Unblock the Notifications