కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: రౌడీషీటర్ కుణిగల్ గిరి విచారణ, అనంతపురంలో !

కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు రౌడీషీటర్ కుణిగల్ గిరిని విచారణ చేసి వివరాలు సేరిస్తున్నారు.

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు రౌడీషీటర్ కుణిగల్ గిరిని విచారణ చేసి వివరాలు సేరిస్తున్నారు. కర్ణాటకలోని రామనగర జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న కుణిగల్ గిరిని గురువారం సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు.

గౌరీ లంకేష్ ను హత్య చేసిన నిందితులు కుణిగల్ గిరితో సంబంధం ఉంటుందని సమాచారం అందడంతో సిట్ అధికారులు ఆకోణంలో విచారణ చేస్తున్నారు. కుణిగల్ గిరి మీద 10కు పైగా కిడ్నాప్ లు, లూటీలు, దోపిడీలు తదితర క్రిమినల్ కేసులు ఉన్నాయి.

 Gauri Lankesh murder case SIT investigating rowdy sheeter Kunigal Giri

కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకున్న కుణిగల్ గిరి ఆంధ్రపద్రేశ్ లోని అనంతపురం నగరంలో తలదాచుకున్నాడు. 2014లో కర్ణాటక పోలీసులు అనంతపురంలో కుణిగల్ గిరి మీద కాల్పులు జరిపి అతన్నిపట్టుకున్నారు. తుమకూరు జిల్లాలోని కుణిగల్ కు చెందిన గిరికి నేరచరిత్ర చాల ఉందని పోలీసులు తెలిపారు.

గౌరీ లంకేష్ హత్య కేసులో పలువురు రౌడీషీటర్ల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో సిట్ అధికారులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు. గౌరీ లంకేష్ హత్య కేసులోని నిందితులకు కుణిగల్ గిరికి సంబంధం ఉంటుందని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+