కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హంతకులు: చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే పీఏ, అచ్చం అదే ఫోటో !

ప్రముఖ కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (సిట్) హంతకుల రేఖా చిత్రాలను విడుదల చేశారు.

బెంగళూరు: ప్రముఖ కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (సిట్) హంతకుల రేఖా చిత్రాలను విడుదల చేశారు. గౌరీ లంకేష్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురి రేఖ చిత్రాలు విడుదల కావడంతో ఇప్పుడు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది.

ఒక హంతకుడి రేఖా చిత్రం అచ్చం బీజేపీ నాయకుడి పోలికలతో ఉండటంతో కర్ణాటకలో ఇదే విషయంపై చర్చకు దారి తీసింది. కర్ణాటకలోని తుమకూరు గ్రామీణ శాసన సభ్యుడు (బీజేపీ) సురేష్ గౌడ ఆప్త సహాయకుడు (పీఏ) ప్రభాకర్ పోలికలతో సీట్ అధికారులు ఒక రేఖా చిత్రాన్ని విడుదల చేశారు.

Gauri Lankesh murder suspect sketch bring problem to BJP MLA PA

సిట్ అధికారులు విడుదల చేసిన రేఖా చిత్రంలో హంతకుడు తిలకం పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే సురేష్ గౌడ పీఏ కూడా నిత్యం తిలకం పెట్టుంటారు. తిలకంతో పాటు ఫోటో రూపురేఖలు ప్రభాకర్ కు అచ్చంగా సరిపోవడంతో కన్నడ మీడియా ఆయన విషయంలో జోరుగా కథనాలు ప్రచారం చేస్తున్నారు.

Gauri Lankesh murder suspect sketch bring problem to BJP MLA PA

గౌరీ లంకేష్ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె గురించి తనకు తెలీదని, అనవసరంగా తనకు చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలా చేస్తున్నారని సోమవారం ప్రభాకర్ తన ఫేస్ బుక్ లో వివరించాడు. గౌరీ లంకేష్ హత్య కేసుకు సంబంధించి తాను మీడియాతో ఇప్పటి వరకూ మాట్లాడలేదని ప్రభాకర్ అంటున్నారు. సిట్ అధికారులు మాత్రం ప్రభాకర్ ఇప్పటి వరకూ విచారణ చెయ్యలేదని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+