బాయ్ ఫ్రెండ్ ని నడిరోడ్డులో చంపేసిన బాయ్ ఫ్రెండ్, వినడానికి వింతగా ఉన్నా నిజమే !
యువతి, యువకుడు ప్రేమించుకోవడం సర్వసాధారణంగా చూస్తుంటాము. కాలేజీల్లో అయితే యువతి, యువకులు ప్రేమించుకుని కాలేజ్ పూర్తి అయిన తరువాత బైక్ ల్లో హ్యాపీగా తిరుగుతూ కాలం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే భారతదేశంలో కూడా అమ్మాయిలు, అమ్మాయిలు, అబ్బాయిలు, అబ్బాయిలు ప్రేమించుకోవడం అక్కడక్కడా చూస్తున్నాము. వీళ్లను స్వలింగ సంపర్కులు అంటారు.
అయితే స్వలింగ సంపర్కులు చాలాకాలం నుంచి రొమాన్స్ చేస్తున్నారు. వీళ్ల మీద ఇంతకాలం ఎవవరికి డౌట్ రాలేదు. అయితే మధ్యలో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. ఈ దెబ్బకు ఇద్దరూ పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని స్వలింగ సంపర్కుడు అయిన కాలేజ్ అబ్బాయి మౌనంగా ఉండిపోయాడు. కాలేజ్ అబ్బాయి మౌనమే చిరికి అతని కొంప ముంచేసింది.

మృతుడు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సు చదువుతూ హాస్టల్‌లో నివాసం ఉంటున్నాడు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లినప్పుడు స్వలింగ భాగస్వామి కత్తితో పొడిచి చంపాడని లోనికండ్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు.
వాఘోలీ ప్రాంతంలోని బకోరి రోడ్డుపై పదునైన ఆయుధంతో కాలేజ్ అబ్బాయి మీద ఒకడు దాడికి పాల్పడినట్లు సమాచారం. కాలేజ్ అబ్బాయి మీద దాడి చేసిన నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చూసిన ఓ వ్యక్తి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దారిలో బాధితుడు తనను పొడిచిన వ్యక్తి పేరు, అతని పేరు ఆసుపత్రికి తీసుకు వెలుతున్న వ్యక్తికి చెప్పాడు.

తనను ప్రేమించిన వ్యక్తి తనను పొడిచాడని, తాము స్వలింగ సంపర్కులు అని, మా ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కత్తితో తనను పొడిచేశాడని ఆ కాలేజ్ అబ్బాయి అతనికి చెప్పాడని సమాచారం. తీవ్రగాయాలైన కాలేజ్ అబ్బాయిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు.పోలీసుల ప్రాథమిక విచారణలో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ వ్యవహారంలోనే హత్య జరిగిందని వెలుగు చూసింది.
గే భాగస్వామి కాలేజ్ అబ్బాయిని పొడిచి చంపేశాడని తెలలిసిందని, నిందితుడి పేరు వివరాలు తెలిశాయని, నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశామని, నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు బృందాలను ఏర్పాటు చేశామని పూణే సిటీ పోలీసు కమీషనర్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. ఇంతకాలం మా మధ్యలో ఉన్నది గే అని తెలుసుకున్న కాలేజ్ అబ్బాయిలు షాక్ అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications