వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెడి(ఎస్)లోకి శివరాజ్ భార్య గీత, హీరో ట్విస్ట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ మంగళవారం జనతా దళ్(ఎస్) పార్టీలో చేరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె షిమోగా నుండి లోకసభ బరిలో దిగనున్నారు.

మంగళవారం ఆమె అధికారికంగా పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గీతా మాట్లాడుతూ.. తన తండ్రి బంగారప్ప సామాన్య ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. తన తండ్రిలా ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు చెప్పారు.

 గీతా శివరాజ్ కుమార్

గీతా శివరాజ్ కుమార్

గీతా రాజ్ కుమార్.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ భార్య మాత్రమే కాదు. ఆమె తండ్రి బంగారప్ప మాజీ ముఖ్యమంత్రి. ఆమె మామ రాజ్ కుమార్ నటుడు.

 గీతా శివరాజ్ కుమార్

గీతా శివరాజ్ కుమార్

తన తండ్రి, మామయ్యల గురించి గీతా మాట్లాడుతూ.... వారి నుండి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. బంగారప్ప కూతురుగా, రాజ్ కుమార్ కోడలిగా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.

గీతా శివరాజ్ కుమార్

గీతా శివరాజ్ కుమార్

ఈ సందర్భంగా గీతా రాజ్ కుమార్ భర్త, నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తనను రాజకీయ నాయకుడిగా చూడవద్దని ప్రజలను కోరారు. తాను మీలాంటి వాడినేనని చెప్పారు.

గీతా శివరాజ్ కుమార్

గీతా శివరాజ్ కుమార్

శివరాజ్ కుమార్ మాట్లాడుతూ... తన తండ్రి రాజ్ కుమార్ రాజకీయాలకు వ్యతిరేకం కాదన్నారు. తన కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పలేదన్నారు.

గీతా శివరాజ్ కుమార్

గీతా శివరాజ్ కుమార్

శివరాజ్ కుమార్ మాట్లాడుతూ... తన భార్య గీతా రాజ్ కుమార్ తన సినిమాలకు సంబంధించిన విషయాలను చూసుకునేదని, కాస్ట్యూమ్స్ కూడా చూసుకునేదన్నారు.

గీతా శివరాజ్ కుమార్

గీతా శివరాజ్ కుమార్

ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేసి ట్విస్ట్ ఇచ్చారు. తాను గీతా శివరాజ్ కుమార్ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. అయితే, అతను మిగిలిన నియోజకవర్గాలలో జెడి(ఎస్) తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు.

English summary
Daughter-in-law of Dr. Rajkumar and Daughter of Ex Chief Minister S Bangarappa Geetha Shivaraj Kumar officially joins JDS in Shimoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X