పైసా ఖర్చు లేకుండా వందలాది టెక్స్ట్ బుక్స్, ఎగ్జామ్ మెటీరియల్: గూగుల్ జెమిని నోట్‌బుక్ మేజిక్
డిజిటల్ విద్యాభ్యాసాన్ని మరింత మెరుగుపర్చడానికి టాప్ సెర్చింజిన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ జెమిని నోట్‌బుక్ లో వందలాది టెక్స్ట్ బుక్స్ ను అందుబాటులో ఉంచింది. భారత్, అమెరికాలోని పబ్లిషర్స్ ముద్రించిన 700కు పైగా పాఠ్యపుస్తకాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఉచితమే. విద్యార్థులు వేర్వేరు స్టడీ, ఎగ్జామ్ మెటీరియళ్లను వెతుక్కునే శ్రమ లేకుండా, ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా వీటిని పొందవచ్చు.
సాధారణ ఏఐ చాట్‌బాట్ల కంటే భిన్నంగా పనిచేస్తుందీ జెమిని నోట్‌బుక్. తాము ఎంచుకున్న పాఠ్యపుస్తకాల ఆధారంగా ఖచ్చితమైన సమాధానాలను పొందువచ్చు.. దీని ద్వారా. విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులను సులువుగా అర్థం చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పరీక్షల సమయాల్లో రివిజన్ చేసుకోవడానికి కావలసిన వనరులను స్వయంగా రూపొందించుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఎక్స్‌పర్ట్ ఇంటెలిజెన్స్ లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది.. గూగుల్. ఈ డిజిటల్ లెర్నింగ్ విధానం కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చనుంది.

ఈ ఉచిత పాఠ్యపుస్తకాల కేటలాగ్‌లో భారత్ కు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ ఎస్ చంద్, అమెరికాలోని ఓపెన్‌స్టాక్స్, ఓపెన్ టెక్స్ట్ బుక్ లైబ్రరీ వంటి సంస్థల పుస్తకాలను గూగుల్ చేర్చింది. విద్యార్థులు ఈ పుస్తకాలను వినియోగించుకోవడానికి ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి పీడీఎఫ్ ఫైల్‌ను విడివిడిగా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా నోట్‌బుక్ ద్వారా వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ నూతన ఫీచర్ ద్వారా జెమిని నోట్‌బుక్ అందించే సమాధానాలు ఏ పేజీ, ఏ ఛాప్టర్ నుంచి వచ్చాయో తెలిపే ఇన్‌లైన్ సైటేషన్లు స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల ఏఐ అందించిన సమాచారం సరైందా, కాదా అనే విషయాన్ని కూడా దాని మూల పుస్తకాల ఆధారంగా విద్యార్థులు నేరుగా సరిచూసుకోవచ్చు. ఆయా టెక్స్ట్ బుక్ కంటెంట్ ఆధారంగా పర్సనలైజ్డ్ స్టడీ గైడ్స్, ప్రాక్టీస్ క్విజ్, ఫ్లాష్ కార్డ్‌లను క్షణాల్లో రూపొందించుకునే వెసులుబాటు కూడా ఉంది. కీలక కాన్సెప్ట్‌లను సులభంగా గుర్తుంచుకోవడానికి ఈ ఫ్లాష్‌కార్డ్స్, క్విజ్‌లు సహాయపడతాయి.
వీటిని పొందాలంటే..ముందుగా జెమిని నోట్‌బుక్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం స్క్రీన్‌పై కనిపించే యాడ్ సోర్సెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందుబాటులో ఉన్న వేర్వేరు కేటగిరీల నుంచి టెక్స్ట్‌బుక్స్ కేటలాగ్ ను ఎంచుకోవాలి. తమ పాఠ్యాంశాలకు సరిపోయే టెక్స్ట్‌బుక్స్ ను ఎంచుకుని తమ పర్సనలైజ్డ్ నోట్‌బుక్‌కు యాడ్ చేసుకోవచ్చు. ఆ వెంటనే ఆ పుస్తకంలోని సంక్లిష్ట అంశాలపై ప్రశ్నలు అడగడం, సమ్మరీలు తయారు చేయడం, ఎగ్జామ్ ప్రిపరేషన్ మెటీరియల్ రూపొందించుకోవచ్చు.














Click it and Unblock the Notifications
