జర్మన్ కోడలిపై కన్నేసిన మామ.. కొడుకు సహాయంతో హోటల్లో 'రేప్'

భార్యను ఒంటరిగా గదిలో వదిలి భర్త ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆపై హోటల్ గదిలోకి వచ్చిన మామ.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. భర్త తండ్రి తనపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె షాక్ కు గురైంది.

న్యూఢిల్లీ: విదేశీ భార్యను పెళ్లాడిన ఓ భారతీయ యువకుడు.. వివాహ బంధానికే మచ్చ తెచ్చాడు. కట్టుకున్న ఆలిని కన్న తండ్రి చేత చెరబట్టించాడు. బాధితురాలు న్యూఢిల్లీ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్ కు చెందిన ఓ యువకుడు జర్మనీకి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత పంజాబ్ లోని స్వగ్రామంలో వీరు కాపురం పెట్టారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. ఓరోజు ఢిల్లీలోని పహ్రాన్ గంజ్ లో ఉన్న ఒక హోటల్ కు భార్యను తీసుకెళ్లాడు భర్త.

 German lady alleges rape by Indian husband, father-in-law

తీరా అక్కడికెళ్లాక.. భార్యను ఒంటరిగా గదిలో వదిలి భర్త ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆపై హోటల్ గదిలోకి వచ్చిన మామ.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. భర్త తండ్రి తనపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె షాక్ కు గురైంది. పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరింది. అయితే ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని జర్మన్ మహిళ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+