కాంచీపురంలో జర్మన్ మహిళపై గ్యాంగ్ రేప్: రిసార్ట్ సమీపంలో దారుణం !

జర్మన్ కు చెందిన 38 ఏళ్ల మహిళ కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని మహాబలిపురంకు పర్యటనకు వచ్చింది. రిసార్ట్ సమీపంలో ఒంటరిగా వెలుతున్న ఆమె మీద సామూహిక అత్యాచారం చెయ్యడంతో కాంచీపురం పోలీసులు కేసు నమోదు

చెన్నై: కుటుంబ సభ్యులతో కలిసి భారత పర్యటకు వచ్చిన విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో జరిగింది. జర్మన్ కు చెందిన 38 ఏళ్ల మహిళ ఫిర్యాదు చెయ్యడంతో కాంచీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జర్మన్ కు చెందిన మహిళ తన కుటుంబ సభ్యులతో సహ 30 మందితో కలిసి భారత పర్యటనకు వచ్చింది. నాలుగు రోజుల క్రితం అందరూ మహాబలిపురం చేరుకుని సమీపంలోని ప్రసిద్ది చెందిన రిసార్టులో బస చేశారు.

German tourist allegedly raped near Mahabalipuram in Tamil Nadu

శనివారం ఉదయం అందరూ మహాబలిపురంలోని బీచ్ కు వెళ్లి సూర్య నమస్కారం చేశారు. తరువాత ఆమె ఒంటరిగా జాగింగ్ కు వెళ్లారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఎండదెబ్బకు ఆమె సమీపంలోని చెట్ల మద్యలోకి వెళ్లి నీరసంగా కుప్పకూలిపోయారని సమాచారం.

ఆ సమయంలో అటువైపు వెళ్లిన కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారైనారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తరువాత రిసార్ట్ చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.

కుటుంబ సభ్యులు బాధితురాలిని పిలుచుకుని కాంచీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్మన్ మహిళ మీద ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారని ఫిర్యాదు అందిందని, విదేశీ మహిళను వైద్య పరీక్షలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని కాంచీపురం జిల్లా ఎస్పీ సంతోష్ హదిమతి మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+