అరవింద్ కేజ్రివాల్ కు జర్మనీ మద్దతు- నిష్పాక్షిక విచారణకు డిమాండ్-జోక్యం వద్దన్న కేంద్రం..!
లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని జర్మనీ తప్పుబట్టింది. ఈ మేరకు జర్మనీ విదేశాంగ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రివాల్ విషయంలో నిష్పాక్షిక విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో కేంద్రం భగ్గుమంది. ఇది తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ తీవ్ర నిరసన తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
NEW
— Richard Walker (@rbsw) March 22, 2024
German Foreign Ministry spokesperson comments on the arrest of Delhi Chief Minister Arvind Kejriwal pic.twitter.com/SYUN56abBe
కేజ్రివాల్ అరెస్టు, జైలుకు పంపడంపై స్పందిస్తూ న్యూఢిల్లీలో డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ ద మిషన్ గా ఉన్న జార్జ్ ఎన్వీలర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని. న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్ర్యం, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు కూడా ఈ కేసులో వర్తిస్తాయని తాము ఊహించామని, ఆశిస్తున్నామని కూడా ఎన్వీలర్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా వారి తరహాలోనే కేజ్రివాల్ విచారణ విషయంలోనూ న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. అలాగే నిర్దోషిత్వాన్ని ఊహించడం అనేది చట్ట నియమం యొక్క ప్రధాన అంశమని, కేజ్రివాల్ కు అది తప్పనిసరిగా వర్తించాలని జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
India protests German Foreign Office Spokesperson's comments:https://t.co/0ItWQCRpyF pic.twitter.com/FZI3fWM51y
— Randhir Jaiswal (@MEAIndia) March 23, 2024
జర్మన్ విదేశాంగ కార్యదర్శి వ్యాఖ్యలు తమ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకునేలా, న్యాయవ్యవస్ధ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారతదేశం చట్టబద్ధమైన పాలనతో కూడిన శక్తివంతమైన, బలమైన ప్రజాస్వామ్యమని, దేశంలో, ప్రజాస్వామ్య ప్రపంచంలోని అన్ని చట్టపరమైన కేసుల తరహాలోనే తక్షణ న్యాయం విషయంలో చట్టం దాని స్వంత మార్గంలో వ్యవహరిస్తుందన్నరు. కాబట్టి ఈ వ్యవహారంలో పక్షపాత ధోరణి ఉందన్న వ్యాఖ్యలు చాలా అసంబద్ధమైనవని తెలిపింది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications