Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Poll: బీజేపీ- జేడీయూ అవుట్?

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. బిహార్. అక్టోబర్/నవంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును కొనసాగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్నివహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తూ వస్తోన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో లోక్‌పోల్ తాజాగా ప్రీ-పోల్ సర్వే నిర్వహించింది. తన అంచనాలను వెల్లడించింది. అధికార ఎన్డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంటుందని అంచనా వేసింది. బీజేపీ- జనతాదళ్ (యునైటెడ్) కూటమికి 105-114 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది.

Get Ahead in Bihar Elections 2025 Groundbreaking Insights from Our Lokpoll Survey

ఆర్జేడీ- కాంగ్రెస్ సారత్యంలోని మహాకూటమి.. 118-126 స్థానాలు దక్కించుకుంటుందని లోక్ పోల్ సర్వే పేర్కొంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 2 నుంచి5 స్థానాలు పొందవచ్చు. ఇది- బీహార్ ఎన్నికల్లో అనూహ్య పోటీకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జోన్ల వారీగా చూసుకుంటే- భాగల్‌పూర్: ఎన్డీఏ- 6 నుండి 8, మహా కూటమి: 4 నుండి 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దర్భంగా: ఎన్డీఏ 15 నుండి 17, మహా కూటమి 11 నుండి 13 సీట్లు సాధించవచ్చని అంచనా.

కోసి: ఎన్డీఏ 6 నుండి 7, మహా కూటమి 5 నుండి 6 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే సూచిస్తోంది. మగధ్: ఎన్డీఏ 14 నుండి 16 సీట్లతో ఆధిక్యంలో ఉండగా, మహా కూటమి 10 నుండి 12 సీట్లు పొందవచ్చు. ముంగేర్: ఎన్డీఏ- 10 నుండి 11, మహా కూటమి- 10 నుండి 12 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. పాట్నా జోన్‌లో మహా కూటమి 26 నుండి 28 సీట్లతో బలమైన పట్టును నిరూపించుకోగా, ఎన్డీఏ 14 నుండి 16 సీట్లు సాధించవచ్చు.

పూర్ణియా జోన్‌లో ఎన్డీఏ, మహాకూటమికి చెరో 10 నుండి 11 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. సారన్: మహా కూటమి 12 నుండి 13 సీట్లతో ఎన్డీఏ కంటే ముందంజలో ఉంది. తిర్హుట్ జోన్‌లో ఎన్డీఏ- 25 నుండి 27, మహా కూటమి 21 నుండి 22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ జోన్‌లో ఇతరులకు ఎలాంటి సీట్లు వచ్చే అవకాశం లేదు. ఈ సర్వే Lokpoll.India ద్వారా నిర్వహించబడింది.

Take a Poll

వలసలు, నిరుద్యోగ సమస్యల కారణంగా యువత, తొలిసారి ఓటు వేస్తున్నవారు మహాకూటమి వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే స్పష్టం చేసింది. తేజస్వి యాదవ్ రిజర్వేషన్ల హామీతో ఓబీసీ, ఈబీసీ వర్గాల నుంచి ఓటుబ్యాంక్ కూటమి వైపు మళ్లిందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం కుల గణన సహాయంతో ఎస్సీ, ఈబీసీలను ఆకట్టుకుంటోంది.

నితీష్ కుమార్ పాలనపై వ్యతిరేకత, అవినీతి, క్షీణించిన శాంతిభద్రతల కారణంగా ఎన్డీఏ- బీజేపీ ప్రతిష్ట మసకబారిందని, విశ్వసనీయత దెబ్బతిన్నాయని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. బీజేపీ చేతిలో నితీష్ కుమార్ కీలుబొమ్మగా మారడం వల్ల మెజారిటీ ఈబీసీ ఓటుబ్యాంక్ మహాకూటమి వైపు మళ్లిందని పేర్కొంది.

దీంతో పాటు జేడీయూకు పెట్టని కోటగా ఉంటూ వచ్చిన తంతి, కుష్వాహా వర్గాల మధ్య ఉన్న మద్దతు క్షీణించింది. ముస్లిం, యాదవ్ వర్గాల ఏకీకరణ ఇండియా బ్లాక్ ను బలపరుస్తుండగా, యాదవ సామాజికవర్గంలో జేడీయూ ప్రభావం తగ్గుతోంది. బీజేపీ ఉన్నత కులాలు, బనియాల మద్దతును నిలుపుకొన్నప్పటికీ.. జేడీయూ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రశంత్ కిశోర్ కు చెందిన జన సూరాజ్ బలపడిందని, అది ఆ ఓటుబ్యాంకును కొల్లగొట్టవచ్చు.

ఓట్ చోరీ అనే ప్రచారం ప్రధాని మోదీ ఛరిష్మాను మసకబారేలా చేసింది. మై బహెన్ మాన్ యోజన, ఉచిత విద్యుత్ వంటి పథకాల వల్ల మహిళా ఓటర్లు ఇండియా బ్లాక్ వైపు మళ్లుతున్నారు. రాహుల్ గాంధీ ప్రతిష్ట గతంలో కంటే బాగా మెరుగుపడింది. ఆయన చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర' యువ ఓటర్లను ఆకర్షిందని లోక్ పోల్ అంచనా వేసింది. ఓట్ షేర్ విషయానికి వస్తే, మహాకూటమికి 38 నుంచి 41 శాతం, ఎన్డీఏకు 39 నుంచి 42 శాతం, ఇతరులకు 12 నుంచి 16 శాతం లభించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+