హిందీ రాదా, ఈ దేశం నుంచి వెళ్లిపో: వివాదాస్పదం
'నేను కన్నడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది హిందుస్తాన్. కాబట్టి ఇక్కడ కన్నడ అవసరంలేదు.
బెంగళూరు: 'నేను కన్నడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది హిందుస్తాన్. కాబట్టి ఇక్కడ కన్నడ అవసరంలేదు. నీకు హిందీ రాకుంటే ఈ దేశం నుంచి వెళ్లిపో' ఇది కర్నాటకలోని మాండ్యలోని ఓ బ్యాంకులో ఓ అధికారి కస్టమర్‌కు చెప్పిన సమాధానం.
ఓ వ్యక్తి కన్నడలో సమాచారం అడిగారు. దానికి బ్యాంకు అధికారి పైవిధంగా సమాధానం చెప్పాడు. ఇది అక్కడ వివాదానికి దారి తీసింది.

హిందీ రాదని చెప్పినందుకు ఓ భారతీయుడిని, ఈ దేశం నుంచి వెళ్లిపోవాలని చెప్పడంపై అక్కడున్న కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అధికారిని నిలదీశారు. ఈ సంఘటన శుక్రవారం రోజు జరిగింది.
కన్నడలో సమాచారం అడిగినందుకు సదరు కస్టమర్ పట్ల అధికారి దురుసుగా ప్రవర్తించాడు. కన్నడలో అడిగే బదులు హిందీ నేర్చుకోవాలని సూచించాడు.
అయితే, కన్నడలో కూడా సమాచారం తెలుసుకోవచ్చునని, అలాంటప్పుడు హిందీలో అడగాలని, హిందీ నేర్చుకోమని ఎలా చెబుతారని పలువురు కస్టమర్లు ప్రశ్నించారు. కాగా, మెట్రో రైల్వే స్టేషన్లలో హిందీలో సైన్ బోర్డులు పెట్టడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ వివాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications