ఫైనల్లీ Infosys నుండి గుడ్ న్యూస్: ఇంత కాలం వెయిట్ చేసినందుకు
Infosys: బెంగళూరుకు చెందిన దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్.. లక్షలాదిమంది ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది. వారి వేతనాలను పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పని చేస్తోన్న ఉద్యోలందరి అప్రైజల్ అసెస్ మెంట్ ప్రాసెస్ ను ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 2026 నాటికి కొత్త వేతనాలు అందుతాయని, ఈ దిశగా ఈ ప్రక్రియ ఉండబోతోందని తెలిపింది.
మొన్నటివరకు కూడా ఇన్ఫోసిస్ లో భారీగా లేఆఫ్స్ కొనసాగిన విషయం తెలిసిందే. ఉద్యోగులను తగ్గించుకుంటూ దడ పుట్టిచ్చింది.ట్రైనీలపై దృష్టి పెట్టిందా సంస్థ యాజమాన్యం. ట్రైనింగ్ అసెస్‌మెంట్ టెస్టులను నిర్వహించి మరీ వాళ్లకు పలికింది. అసెస్‌మెంట్ టెస్టులను నిర్వహించిన తర్వాత అది నాలుగో రౌండ్ లేఆఫ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కిందటి నెల వరకు 800 మంది ట్రైనీలను సాగనంపిందా సంస్థ యాజమాన్యం.

ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం సంస్థలో పని చేస్తోన్న ప్రతి ఒక్క ఉద్యోగికీ అప్రైజల్ ఇవ్వనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగులకు హెచ్ ఆర్ విభాగం నుంచి మెయిల్స్ అందాయి. లేఆఫ్స్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026లో కొత్త వేతనాలు ఉండకపోవచ్చని బెంగ పెట్టుకున్న ఉద్యోగులకు ఇది భారీ ఊరట ఇచ్చినట్టయింది. కొన్ని సంవత్సరాలుగా జీతాల పెంపుదల ఆలస్యం కావడం, సాధారణం కంటే తక్కువ హైక్స్ ఉంటూ వచ్చాయి. ఫలితంగా- చాలామంది ఉద్యోగులు ఈసారి మంచి హైక్స్ ఉండొచ్చని ఆశిస్తోన్నారు.
సాధారణంగా జనవరి నాటికి రేటింగ్స్ ఇస్తుంటుంది ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్. ఫైనల్ అప్రైజల్ లెటర్లు గానీ, సవరించిన జీతాలు గానీ ప్రతి సంవత్సరం కూడా జూన్‌లో విడుదల అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో వేతనాల పెంపులో జాప్యం చేస్తూ వచ్చింది. అప్రైజల్ అసెస్మెంట్ ప్రాసెస్ లో ఆలస్యం చేస్తోంది. గత ఏడాదికి సంబంధించిన చివరి అప్రైజల్ రెండు దశల్లో అంటే జనవరి, ఏప్రిల్ లల్లో అమలు చేసింది.
టీమ్ లీడ్‌లతో సహా జూనియర్ లెవెల్ 5 స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు జనవరి నుండి పెంపుదల వర్తించాల్సి ఉంది. జేఎల్ 6, అంతకంటే ఎక్కువ స్థాయి వారికి ఏప్రిల్ వరకు వేచి ఉండాల్సి వచ్చింది. 2023లో కూడా శాలరీ హైక్స్ లో జాప్యం చోటు చేసుకుంది. అలాగే అంచనాల కంటే తక్కువ శాతాన్ని వేసింది. సాధారణ పెంపుతో పోల్చుకుంటే అన్ని విభాగాల్లో కూడా 5 నుంచి 10 శాతం వరకు తక్కువ వేతనాన్ని పెంచింది. ఈ సారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని ఉద్యోగులు భావిస్తోన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications