సంపద: ఇంగ్లండ్ రాణిని వెనక్కినెట్టిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రపంచంలోని ధనవంతులైన రాజకీయ నాయకుల జాబితాలో 12వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. 2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన సోనియా గాంధీ ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2, సిరియా అధ్యక్షుడు ఆల్ అసద్‌లను వెనక్కి నెట్టినట్లు హుఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ తన నివేదికలో పేర్కొంది.

మధ్య ప్రాచ్య ప్రాంతంలోని రాజులు, అధ్యక్షులు, సుల్తాన్లు, రాణులు మొదలగు వారితో అత్యధిక సంపద కలిగిన 20మంది జాబితాను తయారు చేసినట్లు పేర్కొంది. ఒక దేశ జిడిపితో పోల్చుతూ రాజకీయ నాయకుల సంపదను లెక్కించినట్లు పోస్ట్ తెలిపింది. ఈ జాబితా ద్వారా పేదల, ధనవంతుల జీవితాలలో వ్యత్యాసం తెలుస్తోందని హుఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ పేర్కొంది.

Get this: HuffPost says Sonia Gandhi richer than Elizabeth-II

భారత జిడిపి తలసరి 1,500 డాలర్లు ఉండగా సోనియా గాంధీ 2 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉంది. భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన సంపదతో ప్రపంచంలోని 11మంది ధనవంతులను వెనక్కి నెట్టింది. వారిలో.. మొనాకో యువరాజు ఆల్బర్ట్ ఒక బిలియన్, ఒమన్ సుల్తాన్ కాబూస్ బిన్సేడ్ 700 మిలియన్ డాలర్లు, ఈక్వటోరియల్ గినియా అధ్యక్షుడు టియోడోరో ఒబియంగ్ గౌమా బోసోగో 600 మిలియన్ డాలర్లు కలిగి ఉన్నారు. ఇంకా ఆ జాబితాలో సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్ 550 మిలియన్ డాలర్లతో 16వ స్థానంలో ఉన్నారు.

కాగా సిరియా జిడిపి తలసరి 3వేల డాలర్లుగా ఉంది. ఆశ్చర్యకరంగా సోనియా గాంధీ సంపద కంటే చాలా తక్కువగా ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2, 400 నుంచి 500 డాలర్ల మిలియన్ సంపద మాత్రమే కలిగి ఉండడం విశేషం. 2-19 బిలియన్ డాలర్ల సంపదను కలిగిన సోనియా గాంధీ ప్రపంచంలోని 4వ సంపన్న రాజకీయ నాయకురాలుగా కొనసాగుతున్నారని 2012 మార్చిలో బిజినెస్ ఇన్ సైడర్ తన నివేదిక పేర్కొంది.

కాగా జాతీయ ఎన్నికల పరిశీలన వెబ్‌సైట్ ప్రకారం సోనియా గాంధీకి రూ. 1.38 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమెకు భారతదేశంలో సొంత ఇల్లు గానీ కారు గానీ లేవు. 2.5 కిలోల బంగారం, 88కిలోల బంగారం ఆమె వద్ద ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన నివేదిక ప్రతిపక్షాల చేతిలో అస్త్రంగా మారే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+