నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమని జ్ఞానేశ్ కుమార్‌ ఆఫర్ ఇచ్చారు: కేరళ మాజీ ఐఏస్ అధికారి సంచలనం

ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సర్ అంశంతో పాటు అనేక విషయాల్లో ఇతర ఎన్నికల కమిషనర్లు అయిన సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ ప్రెస్ కీలక కథనాన్ని ప్రచురించింది. దాంతో జ్ఞానేశ్ కుమార్‌ ను తొలగించాలంటూ డిమాండ్లు తీవ్రతరం అయ్యాయి. అటు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామాకు 48 గంటల డెడ్‌ లైన్ విధించింది. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా భారీగా ఉద్యమిస్తామని హెచ్చరించింది. ఇక ఇప్పటికే ఈ అంశంపై బీజేపీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కేరళం రాష్ట్ర మాజీ ఐఏఎస్ ఆఫీసర్..జ్ఞానేశ్ కుమార్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు కేరళ మాజీ ముఖ్య కార్యదర్శి జిజి థామ్సన్‌ మాట్లాడుతూ.. తాను 2016 లో కేరళ లో చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న సమయంలో జ్ఞానేశ్ కుమార్ తనను బీజేపీ టికెట్‌ పై పోటీ చేయమని కోరినట్లు వెల్లడించారు. " 2016 లో నేను ఓ విమాన జర్నీలో ఉన్నప్పుడు జ్ఞానేశ్ కుమార్‌ నా ముందు ఈ ఆఫర్ పెట్టారు. నేను అదే సంవత్సరం రిటైర్ కావాల్సి ఉంది. నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగిన కుమార్.. 2019 లోక్ సభ ఎలక్షన్స్ లో కేరళ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయమని సలహా ఇచ్చారు. నేను కూడా యూనియన్ మినిస్టర్ అవుతానని నాతో చెప్పాడు. నాకు ఆసక్తి లేక అతని ఆఫర్ ను తోసిపుచ్చాను. బీజేపీ నాయకుల నుంచి కాకుండా ఓ ఐఏఎస్ నుంచి ఇలాంటి ఆఫర్ రావడంతో నాకు ఆశ్చర్యం వేసింది" అని జిజి థామ్సన్‌ వెల్లడించారు.

GGThomson Former Kerala IAS remarks CEC Gyanesh Kumar was asked to contest Lok Sabha on BJP ticket

అంతేకాక ప్రధాని మోదీపై జ్ఞానేశ్ కుమార్‌ విపరీతమైన ప్రేమను కురిపించేవారని జిజి థామ్సన్‌ గుర్తుచేసుకున్నారు. ఇక జ్ఞానేశ్ కుమార్‌ కంటే జిజి థామ్సన్‌ సర్వీస్ లో సీనియర్. ఇద్దరూ కేరళ క్యాడర్ కు చెందినవాళ్లే.. థామ్సన్ 1980 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా కుమార్ 1988 బ్యాచ్ ఆఫీసర్.. ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కీలక ట్వీట్ పోస్టు చేశారు. " ఫస్ట్ ఉన్నతాధికారులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ జ్ఞానేశ్ కుమార్‌ ను వాడుకుంది. ఆ తర్వాత మోదీ- షా ఆయన్ను ఎంపైర్ చేసి భారత ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేపిస్తున్నారు. ఇక కేరళం మాజీ ఫైనాన్స్ మినిస్టర్, సీపీఎం నేత థామస్ ఐజాక్ మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్‌ పై కీలక ఆరోపణలు చేశారు. ఓ మలేషియన్ కంపెనీ అధికారి కేరళంలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన అంశంపై అప్పటి పబ్లిక్ వర్క్స్ సెక్రటరీగా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌పై 2006 లో తన సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు వెల్లడించారని తెలిపారు. ఆ డిపార్ట్ మెంట్ లో అవినీతి అధికంగా ఉందని అందువల్ల కుమార్ ను వేరే శాఖకు బదిలీ చేశారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+