వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ సార్ పాక్ నుంచి మమ్మల్ని రక్షించండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మమ్మలి ఫుట్ బాల్ ఆడుకుంటుందని, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రజలకు ఆదేశం నుంచి విముక్తి కల్పించవలసిన నైతిక, చట్టబద్ధ బాధ్యత భారత్ కు ఉందని బీఎన్ఎఫ్ (బలవరిస్థాన్ నేషనల్ ఫ్రంట్) చైర్మన్ అబ్దుల్ హమీద్ ఖాన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఈ లేఖలో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు. బలూచిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్‌ గురించి మాట్లాడిన మొదటి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే మీరే అంటూ ఆయన ప్రశంసించారు. బలూచిస్థాన్‌ను బలూచిస్తాన్ 1948లో పాకిస్థాన్‌లో ఓ రాష్ట్రంగా చేసినప్పటికీ గిల్గిట్-బాల్టిస్థాన్ మాత్రం భారతదేశంలో రాజ్యాంగబద్ధ భాగమని ఆయన తెలిపారు.

1947 అక్టోబరు 26న జమ్మూ-కశ్మీరులో తిరుగులేని మహారాజు హరిసింగ్ రాసిన దస్తావేజు ఇదే చెప్తోందని ఆయన చెప్పారు. పార్లమెంటు 1994లో ఆమోదించిన తీర్మాణం ప్రకారం జమ్మూ-కశ్మీరులో కొన్ని సీట్లను గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రతినిధులకు కేటాయించారన్నారు.

అయితే ఈ సీట్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ఇటువంటి చట్టబద్ధమైన దస్తావేజు లేదని ఆయన స్పష్టం చేశారు. గిల్గిట్-బాల్టిస్థాన్ గురించి పాకిస్థాన్ రాజ్యాంగం, సుప్రీంకోర్టు చెప్తున్నదాని ప్రకారం ఆ ప్రాంతం జమ్మూ-కశ్మీరులోని వివాదాస్పద ప్రాంతమని గుర్తు చేశారు.

Gilgit-baltistanleaders seeks help from PM modi against Pakistan occupation

పాకిస్థాన్ నిరంకుశత్వం నుంచి గిల్గిట్-బాల్టిస్థాన్‌ను రక్షించి అక్కడి ప్రజలను కాపాడవలసిన చట్టబద్ధ, నైతిక బాద్యత భారతదేశానికి ఉందని అబ్దుల్ హమీద్ ఖాన్ పేర్కొన్నారు. బల్టిస్థాన్ నేషనల్ ఫ్రంట్ గిల్గిట్-బాల్టిస్థాన్ విముక్తి కోసం 1992 నుంచి పోరాడుతోందని ఆయన ఇదే సమయంలో గర్తు చేశారు.

ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనదని, ఈ సంస్థపై పాకిస్థాన్ ప్రభుత్వం దేశద్రోహం క్రింద కేసులు పెడుతూ నిత్యం వేధిస్తోందన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి బీఎన్‌ఎఫ్ నేతలపై ఉగ్రవాద చట్టాల ప్రకారం కేసులు పెడుతోందని విచారం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ పెట్టిన తప్పుడు కేసుల్లో బీఎన్ఎఫ్ నేతలు మరణ శిక్షలు, జీవిత ఖైదు శిక్షలు అనుభవిస్తు్న్నారని, ఆ శిక్షలు ఎదుర్కొంటున్నవారికి ఆశ్రయం ఇవ్వాలని, రక్షణ కల్పించాలని అబ్దుల్ హమీద్ ఖాన్ లేఖలో మనవి చేశారు. ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారు ? అని పాక్ ఎదురు చూస్తోంది.

మొత్తం మీద పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లో భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత పాక్ గజగజ వనికిపోతుంది. ఇలాంటి సమయంలో ఆదేశంతో సమస్యలు ఎదుర్కొంటున్న నేతలు భారత్ ను ఆశ్రయించడంతో పాక్ ఇకా భయానికి గురైయ్యింది. భారత్ ఈ విషయంలో ఎలా స్పందిస్తోందని పాక్ ప్రభుత్వం టెన్షన్ పడిపోతుంది.

English summary
Since 1992, the Balawaristan National Front is struggling to emancipate this strategically most important and disputed region, from the occupation of Pakistan. BNF is facing sedition charges of section 124A. For the last two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X