కల్బుర్గి గతే: చంపేస్తామంటూ కర్నాడ్‌కు బెదిరింపు
బెంగళూరు: చంపేస్తామంటూ ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌కు బెదిరింపులు వచ్చాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేసినందుకు ఆయను చంపేస్తామంటూ హెచ్చరికలు చేశారు.
హిందువులను, వొక్కలింగ వర్గాన్ని అవమానిస్తూ సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. మంగళవారంనాడు టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా గిరీష్ కర్నాడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలను నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. వాటిలో కొన్ని హింసాత్మకంగా మారి, పోలీసు కాల్పుల్లో ఓ విహెచ్‌పి కార్యకర్త మరణించాడు.

తన వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో జ్ఝానపీఠ అవార్డు గ్రహీత కూడా అయిన గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నానని, అలా చెప్పడం వల్ల తనకేం వస్తుందని ఆయన అన్నారు.
ఇన్ టోలరెంట్ చంద్ర అనే యూజర్ నేమ్‌తో ట్విట్టర్‌లో గిరీష్ కర్నాడ్‌ను హెచ్చరిస్తూ పోస్టింగ్ వచ్చిందని, దీనిపై ఏమైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కల్బుర్గికి పట్టిన గతే నీకు పడుతుందంటూ గిరీష్ కర్నాడ్‌కు బెదిరింపులు వచ్చాయి.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications